టాటా గ్రూప్ నుండి రేపు అతిపెద్ద వార్త వినబోతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ హెచ్అర్‌డీ మినిస్టర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఉత్కంఠను రేపుతోంది. మంగళవారం(అక్టోబర్ 8) ముంబైలో టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్ర శేఖరన్ తో లోకేష్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ నుంచి వచ్చే ప్రకటన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు సంబంధించిన వార్త అయి ఉంటుందంటూ ప్రచారం సాగుతోంది.
ఈ ఏడాది ఆగష్టు 16 న టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ విజయవాడ వచ్చిన సందర్భంలోనూ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి మరీ రిసీవ్ చేసుకుని, మళ్ళీ వీడ్కోలు పలికారు మంత్రి నారా లోకేష్. ఆ సమయంలో రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టాలని ప్రత్యేకంగా ఆయనతో సమావేశమై మరీ అర్థించారు. దీంతో తాజా ప్రకటనపై ఆసక్తి కొనసాగుతోంది..
అదే సమయం లో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల అన్వేషణ కోసం సీఎం కన్వీనర్ గా ఏర్పాటు చేయతలపెట్టిన టాస్క్‌పోర్స్‌కు కో కన్వీనర్‌గా వ్యవహరించాలని టాటా గ్రూప్ చైర్మన్‌ను కోరింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాటు కాన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీ బాగస్వామ్యంతో అమరావతిలో సెంటర్ ఫర్ గోబర్‌నెస్ (జీఎల్సీ) ఏర్పాటుకు టాటా సంస్థ అంగీకరించింది. ఈ రెండింటి పైనా ప్రకటన ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది.
📢I had a superb meeting with the Chairman of the Board of Tata Sons, Mr Natarajan Chandrasekaran today. BIG ANNOUNCEMENT tomorrow!✨ Stay tuned! 😉 @TataCompanies pic.twitter.com/FumMaBULdG
— Lokesh Nara (@naralokesh) October 8, 2024
రాష్ట్ర ఐటీ డెస్టినేషన్‌గా భావించే విశాఖలో టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటును ఏర్పాటు చేసే ఆలోచనలో టాటా గ్రూప్ ఉందని, ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదనపై నటరాజన్ చంద్రశేఖరన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఇది ఏర్పాటు అయితే సుమారు 2 నుంచి మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు బభిస్తాయని అంచనా. ఇప్పటికే విశాఖ లో ఇన్ఫోసిస్ సంస్థ తమ డెవలప్‌మెంట్ సెంటర్ ను అభివృద్ధి చేసి ఉంది. తాజాగా టీసీఎస్‌డీసీ కూడా ఏర్పాటు కాబోతుందంటూ ప్రచారం సాగుతోంది.
టాటా గ్రూప్ హోల్డ్ చేస్తున్న ఎయిర్ ఇండియా, విస్తారా ఐగస్వామ్యంతో రాష్ట్రం నుంచి ఎయిర్ కనెక్టివిటీ పెంపొందించే ప్రణాళికలపైనా ప్రకటన ఉండొచ్చని సమాచారం. వీటితో పాటు టాటా కంపెనీ రాబోయే నాలుగైదేళ్లలో రాష్ట్రానికి ప్రత్యేక పెట్టుబడుల ప్యాకేజీ ప్రకటించేందుకు టాటా సంస్థం చైర్మన్ ఆసక్తి గా ఉన్నారన్న సమాచారం కూడా ఉంది. ఈ నేపద్యంలో టాటా గ్రూప్ ప్రకటన ఎలా ఉండబోతుందన్న చర్చ ప్రస్తుతం నడుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..