Breaking News: కరోనాతో మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత..

క‌రోనా వైర‌స్‌ బారిన పడి అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి మృతి చెందారు. రెండు వారాల పాటు కరోనాతో పోరాడిన...

Breaking News: కరోనాతో మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత..
Sabbam Hari

Updated on: May 03, 2021 | 2:35 PM

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా టీడీపీ నాయకుడు, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి మృతి చెందారు. రెండు వారాల పాటు కరోనాతో పోరాడిన ఆయన కాసేపటి క్రితం తుది శ్వాసను విడిచారు. ఏప్రిల్ 15వ తేదీన సబ్బం హరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొదట్లో హోం క్వారంటైన్ లో ఉన్న ఆయన.. ఆ తర్వాత విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందించినా.. పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. గతంలో విశాఖ మేయర్ గా పనిచేసిన సబ్బం హరి.. 2019 ఎన్నికలలో భీమిలి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.