ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు కూడా గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. దానిలో భాగంగా.. గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలంలో సందడి చేశారు. ముందుగా.. కొలకలూరులోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడారు. అనంతరం ఖాజీపేట గ్రామంలోని రైతు బరోసా కేంద్రంలో రైతులతో ముచ్చటించారు. అనంతరం శాలివాహన సంఘ సభ్యులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక.. మధ్యాహ్నం భోజనం తర్వాత జిల్లా పరిషత్ హైస్కూల్‌కు వెళ్లి అక్కడి వసతులను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా.. గుంటూరు జిల్లాలో అన్ని ప్రాంతాలు తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు అంబటి రాయుడు.
ప్రభుత్వ పరంగా మంచి సపోర్ట్ అందుతుందని రైతులు చెప్తున్నారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను పరిశీలించానని.. రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు బాగా ఉపయోగపడుతున్నాయని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు.. ప్రభుత్వ స్కూల్స్ కూడా ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయని.. విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మంచి మార్పులు తీసుకొచ్చిందన్నారు. ఇక.. సీఎం జగన్‌తో భేటీపైనా స్పందించారు. సీఎం జగన్‌ను స్పోర్ట్స్ గురించి మాత్రమే కలిశా తప్ప.. రాజకీయాలు లేవన్నారు. స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ చెప్పినట్లు వెల్లడించారు. అలాగే.. ప్రజలకు సేవ చేయాలని తమ తాత దగ్గర నుంచి నేర్చుకున్నానన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..