Chittoor: అతని వద్ద ఉన్నది బొమ్మ తుపాకీ అని ఫ్రెండ్స్ బార్‌లో గేలి చేశారు.. కట్ చేస్తే..

చిత్తూరుకు చెందిన మల్లికార్జున ఆర్మీలో పనిచేసి 2021లో రిటైరయ్యాడు.  విధుల్లో ఉన్న టైమ్‌లోనే లైసెన్సుతో ఓ పిస్టల్‌ కొనుగోలు చేశాడు. మంగళవారం రాత్రి స్థానికంగా ఉన్న ఓ బార్‌కు ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లాడు. లిక్కర్ తాగుతున్న క్రమంలో తన దగ్గర ఉన్న పిస్టల్‌ నిజమైనది కాదంటూ ఫ్రెండ్స్ ఆట పట్టించడంతో మల్లికార్జున సహించలేకపోయాడు.

Chittoor: అతని వద్ద ఉన్నది బొమ్మ తుపాకీ అని ఫ్రెండ్స్ బార్‌లో గేలి చేశారు.. కట్ చేస్తే..
Bullet Shell

Edited By: Ram Naramaneni

Updated on: Feb 01, 2024 | 12:36 PM

చిత్తూరు, ఫిబ్రవరి 1:  అతను మాజీ ఆర్మీ జవాన్. విధుల్లో ఉన్నప్పుటి నుంచే లైసెన్సుతో కూడిన పిస్టల్ ఉంది. ఇటీవల అతను ఫ్రెండ్స్‌తో కలిసి బార్‌కు వెళ్లాడు. అయితే ఫ్రెండ్స్ అతని వద్ద ఉన్నది బొమ్మ తుపాకీ అని గేలి చేశారు. దీంతో ఆగ్రహానికి గురై పిస్టల్‌ను బయటకు తీసి నేలకు గురి పెట్టి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు.  వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరుకు చెందిన మల్లికార్జున ఆర్మీలో పనిచేసి 2021లో రిటైరయ్యాడు.  విధుల్లో ఉన్న టైమ్‌లోనే లైసెన్సుతో ఓ పిస్టల్‌ కొనుగోలు చేశాడు. మంగళవారం రాత్రి స్థానికంగా ఉన్న ఓ బార్‌కు ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లాడు. లిక్కర్ తాగుతున్న క్రమంలో తన దగ్గర ఉన్న పిస్టల్‌ నిజమైనది కాదంటూ ఫ్రెండ్స్ ఆట పట్టించడంతో మల్లికార్జున సహించలేకపోయాడు. ఆవేశానికి గురై పిస్టల్‌ను తీసి నేలవైపు గురిపెట్టి ఒక రౌండ్‌ కాల్పులు జరిపాడు. దీంతో బార్‌లో ఉన్నవారందరూ భయపడి పరుగులు తీశారు. తప్పు గ్రహించిన మల్లికార్జున కూడా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.

స్థానికులు డయల్‌-100కు ఫోన్ చేసి విషయం చెప్పడంతో చిత్తూరు పోలీసులు వచ్చి పరిశీలించారు. బుధవారం ఉదయం బుల్లెట్‌ అవశేషాలు, ఖాళీ తుపాకీ కేస్‌లు స్వాధీనం చేసుకుని మల్లికార్జునను అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రస్తుతం RPFలో కాంట్రాక్టు పద్ధతిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని తాజా వార్తలు ఇక్కడ చదవండి