యూరోప్ దేశాలకు కోనసీమ కొబ్బరి

|

Oct 09, 2020 | 4:05 PM

కోనసీమ కొబ్బరి కి ప్రసిద్ధి. కోనసీమ ప్రాంతంలో లక్షా 25 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. గత కొంత కాలంగా ధర లేక తెగుళ్లు బారినపడి ఇబ్బంది పడుతున్న కొబ్బరి రైతాంగానికి కరోనా నేపథ్యంలో మంచి రోజులు రానున్నాయి.

యూరోప్ దేశాలకు కోనసీమ కొబ్బరి
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ కొబ్బరి కి ప్రసిద్ధి. కోనసీమ ప్రాంతంలో లక్షా 25 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. గత కొంత కాలంగా ధర లేక తెగుళ్లు బారినపడి ఇబ్బంది పడుతున్న కొబ్బరి రైతాంగానికి కరోనా నేపథ్యంలో మంచి రోజులు రానున్నాయి. కోనసీమ కొబ్బరి దిగుమతి చేసుకునేందుకు యూరోప్ దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని ఇచ్చే కొబ్బరి తో పాటు ఇతర సుగంధ ద్రవ్యాలు దిగుమతి చేసుకునేందుకు యూరోప్ దేశాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

కోనసీమ లో లభించే కొబ్బరిని యూరోపియన్ సభ్యదేశాల యునైటెడ్ కింగ్డమ్, బెల్జియం, నెదర్లాండ్స్, స్పెయిన్, జర్మనీ దేశాలు దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కరోనా సమయంలో రోగనిరోధకశక్తిని పెంపొందించేందుకు భారతీయ సాంప్రదాయ వంటకాలు ఆహారపు అలవాట్లు ఎంతో ఉపయోగిస్తున్నాయని యూరోపియన్ దేశాలు గుర్తించాయి. ఇప్పటికే మన దేశంలోని కేరళ తమిళనాడు నుంచి యూరోపియన్ దేశాలకు కొబ్బరి ఎగుమతి అవుతుంది అయితే కావాల్సిన స్థాయిలో లభించకపోవడంతో కోనసీమ కొబ్బరి దిగుమతి చేసుకోవాలని యూరోపియన్ దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆ దేశాలు నియమించుకున్న ప్రతినిధి విళ్ల దొరబాబు చెప్పారు. దీనిలో భాగంగా కోనసీమ కొబ్బరి తో పాటు మిరియాలు, కారం ఇలా పలు ఉత్పత్తులను ఆంధ్ర రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకునేందుకు యూరప్ దేశాలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో ఎగుమతులు ప్రారంభమవుతాయని దొరబాబు వెల్లడించారు.

ఇందుకోసం యూరోప్ ఇండియా సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ సంస్థ ద్వారా చర్చలు జరుగుతున్నాయి. డిసెంబర్‌లో దీనిపై విశాఖపట్నంలో ఒక సదస్సు జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో సాంప్రదాయ విధానంలో సాగు జరుగుతుండడంతో యూరోపియన్ దేశాలు దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పారు.

కోనసీమ కొబ్బరి యూరోపియన్ దేశాలు దిగుమతి చేసుకుంటే రైతాంగానికి భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని స్థానిక రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.