Eluru: చెరువులోకి దిగిన వ్యక్తి ముక్కులోకి దూరిన రొయ్య.. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి.. చివరకు

|

Jul 07, 2022 | 9:59 AM

ఇది కాస్త వింత వార్తే.. చెరువులోకి దిగిన రైతు ముక్కులోకి దూసుకెళ్లింది రొయ్య. అతను ఎంత ప్రయత్నించినా అది బయటకి రాలేదు. దీంతో ఊపిరి తీసుకోలేక అల్లాడిపోయాడు.

Eluru: చెరువులోకి దిగిన వ్యక్తి ముక్కులోకి దూరిన రొయ్య.. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి.. చివరకు
Prawn Stuck In Nose
Follow us on

AP News: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో లభించే రొయ్యలకు 2 రాష్ట్రాల్లో ఎంతో గిరాకీ. రొయ్యలను ఇష్టపడే నాన్ వెజ్ ప్రియులు.. వేపుడు అని, ఇగురు అని రకరకాలుగా దాని టేస్ట్‌ను ఎంజాయ్ చేస్తారు. అయితే తాజాగా ఓ రొయ్య ఓ వ్యక్తిని ఉక్కిరిబిక్కరి చేసింది. ఊపిరాడనివ్వకుండా అల్లాడించింది. చిన్న సైజ్‌లో ఉండే రొయ్య.. అది కూడా కనీసం కాటేయడం.. కుట్టడం కూడా రాని రొయ్య.. కనీసం ముళ్లు కూడా కలిగి ఉండని రొయ్య.. అంతపెద్ద మనిషిని ఏం చేసిందనేగా మీ డౌట్. అక్కడికి వస్తున్నాం  వివరాల్లోకి వెళ్తే..  ఏలూరు జిల్లా గణపవరం(Ganapavaram)లో ఒక వ్యక్తి ముక్కులో రొయ్య ఇరుక్కుంది. రొయ్యలను పట్టేందకు చెరువులోకి దిగిన సమయంలో ఓ రొయ్య ఉన్నట్టుండి అతని ముక్కులోకి దూరింది. అది ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో.. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అయ్యి.. ఆ రైతు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. దీంతో వెంటనే అతడిని  భీమవరంలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు కుటుంబ సభ్యులు. వెంటనే అలెర్టెన డాక్టర్లు ఎండోస్కొపీ ద్వారా ముక్కు నుండి రొయ్యను బయటకు తీశారు. దీంతో ప్రాణాలతో బయటపడ్డాడు రైతు. కాగా చేపలు, రొయ్యల చెరువుల్లోకి దిగే రైతులు, రైతు కూలీలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఏపీ వార్తల కోసం