AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోని వంట గదిలో కనిపించినవి చూసి విస్తుపోయిన అధికారులు.. ఇవిగో డీటేల్స్..!

శేషాచలం అడవుల్లో అసలేం జరుగుతోంది.. ఏనుగు దంతాల స్మగ్లింగ్ వ్యవహారం అటవీశాఖను కలవర పెడుతోంది. ఎలిఫెంట్స్ సేఫ్టీ పై అటవీ శాఖకు ఆందోళన నెలకొంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో పట్టుబడ్డ ఏనుగు దంతాల కేసు మూలాలపై జరుగుతున్న విచారణ అటవీ శాఖకు సవాలుగా మారింది.

ఇంట్లోని వంట గదిలో కనిపించినవి చూసి విస్తుపోయిన అధికారులు.. ఇవిగో డీటేల్స్..!
Forest Officers Seatch
Raju M P R
| Edited By: |

Updated on: Mar 23, 2026 | 9:20 AM

Share

శేషాచలం అడవుల్లో అసలేం జరుగుతోంది.. ఏనుగు దంతాల స్మగ్లింగ్ వ్యవహారం అటవీశాఖను కలవర పెడుతోంది. ఎలిఫెంట్స్ సేఫ్టీ పై అటవీ శాఖకు ఆందోళన నెలకొంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో పట్టుబడ్డ ఏనుగు దంతాల కేసు మూలాలపై జరుగుతున్న విచారణ అటవీ శాఖకు సవాలుగా మారింది.

శేషాచలం అటవీ ప్రాంతం. దట్టమైన అడవులు అరుదైన వృక్ష జంతు జాతులకు నిలయం. అయితే ఈ మధ్య స్మగ్లర్ల బెడద శేషాచలం అడవులను ఆందోళనకు గురి చేస్తోంది. ఎర్రచందనం స్మగ్లర్ల అలజడి ఒకవైపు కొనసాగుతుంటే, ఇప్పుడు ఏనుగుల దంతాల స్మగ్లింగ్ మూలాలు శేషాచలం అటవీ ప్రాంతానికి ముడిపడినట్లు భావిస్తున్న అటవీశాఖలో ఆందోళన ప్రారంభమైంది. ఎర్రచందనం చెట్లు నేలకు ఒరుగుతున్నట్లే, వన్యప్రాణులు కూడా అంతమొందుతున్నాయని అటవీ శాఖ గుర్తిస్తుంది.

ఇప్పటికే భాకరాపేట ఫారెస్ట్ ఆఫీసు లోని ఏనుగు దంతాలు చోరీకి గురైన కేసు కొలిక్కి రాకపోగా ఇప్పుడు తిరుపతి జిల్లాలో మరోసారి ఏనుగుల దంతాల స్మగ్లింగ్ కేసు నమోదు కావడంతో అటవీ శాఖ ఆందోళన చెందుతోంది. దీంతో ఇప్పటిదాకా ఎర్రచందనం అక్రమ రవాణా మీదే దృష్టి సారించిన అటవీ శాఖ ఇప్పుడు కలవరపాటుకు గురిచేస్తున్న వేటపైనా నిఘా పెట్టాల్సి వచ్చింది. విలువైన ఏనుగు దంతాల అక్రమ రవాణాకు శేషాచలం అటవీ ప్రాంతంలో బీజం పడిందా అన్నట్టు ఏనుగు దంతాల కేసు విచారణ సాగుతోంది.

శేషాచలం అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల రక్షణతో పాటు అడవుల సంరక్షణకు టెక్నాలజీని వాడుతున్న అటవీ శాఖ డ్రోన్లు, నైట్ మోడ్ కెమెరాలు, మోషన్ క్యాప్చర్ కెమెరాలు ఏర్పాటు చేసినా రక్షణ ప్రశ్నార్ధకం గానే ఉందన్న విషయం స్పష్టం అవుతుంది. అటవీ శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వందకు పైగా ఏనుగులు ఉండగా శేషాచలం అడవుల్లో ఆ సంఖ్య 30కి పైగానే ఉంటుంది. యాంటీ పోచింగ్ విభాగంతో పాటు రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ సరిహద్దు అటవీ భద్రతా సిబ్బంది, అటవీ తనిఖీ కేంద్రాల వద్ద నిరంతరం నిఘా కొనసాగుతున్నా గత వారంలో చంద్రగిరి మండలం చిన్న రామాపురంలో ఏనుగు దంతాలు లభ్యం కావడం కలకలం రేపింది. ఏనుగు దంతాల స్మగ్లింగ్ కేసు అటవీ శాఖ వైఫల్యాలను బయట పెడుతోంది.

రెండేళ్ల క్రితం అటవీ శాఖలో కలకలం రేపిన దంతాలు, గన్‌ చోరీ కేసుపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాకపోగా ఇప్పుడు మరోసారి చంద్రగిరి మండలం చిన్న రామాపురంలో ఏనుగు దంతాలు, నాటుతుపాకులు అటవీ శాఖ స్వాధీనం చేసుకుంది. రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ నిందితుడిని శివకుమార్ గా గుర్తించింది. ఎర్ర వారిపాలెం మండలం కోటకాడపల్లికి చెందిన మరో స్మగ్లర్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న అటవీ శాఖ ఆవులు మేపుకుంటూ జీవనం సాగిస్తున్న శివ కుమార్ ఇంట్లో ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకుంది. రెండు నాటు తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ సిబ్బంది, నిందితుడి నుంచి స్మగ్లింగ్ ముఠా కార్యకలాపాలపై ఫోకస్ చేసింది. ఏనుగు దంతాల స్మగ్లింగ్ ముఠా కార్యకలాపాలను ఆరా తీస్తోంది.

ఇక ఏనుగుల దంతాలు స్మగ్లర్ల చేతికి ఎలా చేరుతున్నాయో తెలుసుకోవడం అటవీశాఖకు సవాలుగా మారింది. ఏనుగులను వేటాడి దంతాలు స్మగ్లింగ్ చేస్తున్నారా లేక అనారోగ్యంతో అడివిలో చనిపోయిన ఏనుగుల నుంచి దంతాలను సేకరిస్తున్నారా అన్న కోణంలో అటవీ శాఖ దర్యాప్తు చేస్తోంది. వాస్తవాలు రాబట్టే పనిలో అటవీ శాఖ తల మునకలైంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us