Eggs Price Today: కొండెక్కిన కోడి గుడ్డు ధరలు.. డజను గుడ్లు ఎంతో తెలుసా?

కార్తీక మాసం చివరికి వచ్చినా నిత్యవసరాల ధరల మోత తగ్గడం లేదు. మోంథా తుపాను సాకుతో రైతులు కూరగాయల ధరలు మండిస్తున్నారు. ఇక దళారుల సంగతి సరేసరి. వీళ్లు ఆడిందే ఆటగా జోరుగా దందా సాగిస్తున్నారు. కారీక మాసం ఆరంబానికి ముందున్న పరిస్థితులు ప్రస్తుతానికి పూర్తిగా..

Eggs Price Today: కొండెక్కిన కోడి గుడ్డు ధరలు.. డజను గుడ్లు ఎంతో తెలుసా?
Egg Price Hiked

Updated on: Nov 18, 2025 | 11:22 AM

అమరావతి, నవంబర్‌ 18: కార్తీక మాసం చివరికి వచ్చినా నిత్యవసరాల ధరల మోత తగ్గడం లేదు. మోంథా తుపాను సాకుతో రైతులు కూరగాయల ధరలు మండిస్తున్నారు. ఇక దళారుల సంగతి సరేసరి. వీళ్లు ఆడిందే ఆటగా జోరుగా దందా సాగిస్తున్నారు. కారీక మాసం ఆరంబానికి ముందున్న పరిస్థితులు ప్రస్తుతానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. కిలో రూ.20 అమ్మిన కూరగాయలు ఇప్పుటు సెంచరీ కొడుతున్నాయి. ఓ వైపు పెరిగిన కూరగాయల ధరలు సామాన్య, మధ్య తరగతి జనాలకు చుక్కలు చూపిస్తుంటే.. మరో వైపు కోడిగుడ్ల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి.

కూరగాయలు ఎక్కువ శాతం కిలో వంద రూపాయలకు చేరుకుంటే.. కోడిగుడ్డు సైతం తగ్గేదే లే.. అంటూ ఏడు రూపాయలకు చేరింది. దీంతో వినియోగదారులు వీటిని కొనే మార్గంలేక లభోదిభోమంటున్నారు. ప్రస్తుతం కార్తిక మాసం ఉపవాసాలతోపాటు అయ్యప్ప దీక్షలు కూడా తీసుకునే సమయం. ఈ సమయంలో గుడ్లు వినియోగం సాధారణంగా తక్కువగా ఉంటుంది. అయితే ఇందుకు భిన్నంగా ఈసారి గుడ్డు ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగాయి. గత నెలలో రూ.5 నుంచి రూ.6 విక్రయించిన గుడ్డు.. ప్రస్తుతం రూ.7 నుంచి రూ.8 వరకు అమ్ముతుంది. ఇక డజను గుడ్లు రూ.98 వరకు పలుకుతున్నాయి. దీంతో జనాలు గుడ్లు కొనేందుకు ఆలోచిస్తున్నారు.

డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేకపోవడమే ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఇక అక్టోబరులో కిలో చికెన్‌ రూ.240 నుంచి రూ.260 ఉంటే.. ప్రస్తుతం రూ.20 నుంచి రూ.40 వరకు తగ్గింది. మాంసం ధరలు తగ్గితే గుడ్డురేటు మాత్రం పెరగడం పైపైకి వెళ్లడం విడ్డూరంగా ఉంది. మరోవైపు తెలంగాణలోనూ గుడ్లు, కూరగాయల ధరలు ఇదే మాదిరి చుక్కలు చూపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.