ఈమె మాములు పర్సన్ కాదు. జంతర్ మంతర్ కిలాడీ. టక్కుల మారి లేడీ. కాసేపట్లో మాటలు కలుపుతుంది. ఎంతో మంచి మనిషి అనిపించేలా మెలుగుతుంది. సరైన టైమ్ చూసి.. యాక్షన్‌లోకి దిగి అందినకాడికి దోచుకెళ్లిపోతుంది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఈ నంగనాశిపై చాలా కేసులే ఉన్నాయి. చిక్కకుండా తిరుగుతున్న ఈ మోస్ట్ వాంటెడ్ లేడీకి సంబంధించిన సమాచారం ఇస్తే నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. ఈమెను పట్టిస్తే పది వేలు ఇస్తామంటున్నారు. మత్తుమందు ఇచ్చి ఒంటరి మహిళలను మాయమాటలతో దోచుకుంటున్నట్లు ఈమెపై అభియోగాలున్నాయి.
ఇంతకీ ఈవిడగారి పేరు చెప్పలేదు కదా..?. జగదాంబ అలియాస్ బుజ్జి. ఎవరో తెలిసిన వ్యక్తిలా పలకరిస్తుంది. వచ్చి పక్కనే కూర్చుకుంటుంది. యోగక్షేమాలు అడుగుతుంది. మాటల్లో పెట్టి.. నిద్ర మాత్రలు కలిపిన కూల్ డ్రింక్‌ను ఒంటరిగా ఉన్న మహిళలకు ఇచ్చి స్పృహ కోల్పోయేలాగా చేస్తుంది. అనంతరం ఇంట్లో ఉన్న నగలు, నగదును దోచుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. పలు మార్గాల్లో ఈ కిలేడీని అన్వేశించి.. విసిగిపోయిన పోలీసులు.. ఆఖరికి నగదు బహుమతి ప్రకటించారు. పైన ఫోటోలో ఉన్న మహిళ జగదాంబ కనిపిస్తే.. 9491326456 లేదా 996333265 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అది విషయం.. ఇంటికి గుర్తుతెలియన వ్యక్తులు వస్తే అస్సలు ఎంకరేజ్ చెయ్యొద్దు. కేటుగాళ్లు, మోసగత్తెలు రకరకాలు మారువేశాల్లో వస్తారు. ఆదమరిచారో చెమటోడ్చి సంపాదించిన సొమ్మంతా ఎగరేసుకుపోతారు. తస్మాత్ జాగ్రత్త.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..