
పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోనీ పాయిజన్ కలిగిన ఫంగస్ రూపంలో ఉన్న కోడిగుడ్లు కలకలం రేపాయి. స్థానిక పోతవరం గిరిజన గ్రామంలో కోయ ఎంపీపీ స్కూల్లో మిడ్ డే మిల్స్ లో విద్యార్థులకు పెట్టేందుకు వంట కుక్క ఉడకబెట్టి కోడిగుడ్లను వలిచే క్రమంలో కోడిగుడ్లు లోపల పాముకాటు మచ్చల రూపంలో దుర్వాసన వెదజల్లే వాసన వచ్చింది. దీన్ని గమనించిన సిబ్బంది వాటని విద్యార్థులకు పెట్టకుండా పక్కన పడేసారు. కోడిగుడ్ల విషయమై వాటిని సరఫరా చేసే నిర్వాహకుడికి ఫోన్ చేయగా పొంతన లేని సమాధానం చెప్పాడు.
అయితే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురంలోని వరలక్ష్మి పౌల్ట్రీ నుండి నిత్యం వందలాది సంఖ్యలో కోడిగుడ్లను పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్నటువంటి కోయ ఎయిడెడ్ స్కూల్ లకు, అంగన్వాడి కేంద్రాలకు సరఫరా అవుతుంటాయి. ఈ క్రమంలో ప్రతి స్కూల్లో కూడా ఇలా కుళ్ళిపోయి, మచ్చల రూపంలో పచ్చగా తయారైన గుడ్లే కనిపించాయి. దీనిపై స్థానిక సిబ్బంది గుడ్ల నిర్వాహకుడిని ప్రశ్నించగా.. దానికి బదులుగా కొన్ని ఇతర గుడ్లను ఇస్తూ తప్పించుకు తిరుగుతున్నాడని కొంతమంది టీచర్లు టీవీ9 కు తెలిపారు.
తాజాగా గుడ్లలో కనిపించిన మచ్చల అంశంపై నిర్వాహకునికి ఫోన్ చేయగా..వాటిని మార్చి ఇస్తానని మాస్టారుకు ఫోన్లో తెలిపాడు. అయితే గతంలోనే ఇలాంటి ఘటనలే చోటుచేసుకోవడంతో దీనిపై విచారణ చేపట్టి నిర్వాహలకుపై చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.