
మనిషి మనుగడ సాఫీగా సాగాలంటే చెట్లు అవసరం. అందుకే కొందరు చెట్ల ప్రయోజనాలను గుర్తిస్తున్నారు. అత్యవసర సమయంలో చెట్లు తొలగించాల్సివస్తే వాటిని తగిన జాగ్రత్తలు తీసుకుని.. అవి మల్లీ బ్రతికి చిగురించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
తూర్పు గోదావరిజిల్లా పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామంలో వినాయకుని గుడి ఉంది. ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న 110 ఏళ్ల నాటి రవి చెట్టును తొలిగించాల్సి వచ్చింది. ఐతే అంత పురాతన చెట్టును ఎలాగైనా బ్రతికించాలని గ్రామస్తులు నిర్ణయించారు. కడియం మండలం బుర్రిలంకలో కొత్తపల్లి మూర్తి రసాయన చర్య ద్వారా తొలగించిన చెట్లను తిరిగి బ్రతికిస్తున్నట్లు తెలుసుకుని ప్రత్యేక జాగ్రత్తలతో చెట్టును పెకలించి జాగ్రత్తగా కడియం తరలించారు. గ్రామస్తుల చెట్టు కోసం తపన చూసి మూర్తి ఆశ్చర్యపోయారు. ఇలా ఇంత జాగ్రత్త, శ్రద్ధతో ఒక చెట్టును బ్రతికించాలన్న తపనతో వ్యవహరించిన వాళ్లు చాలా అరుదుగా ఉంటారని మూర్తి చెబుతున్నారు. ఇప్పటి వరకు 50 భారీ, అతి భారీ వృక్షాలకు జీవం పోసిన మూర్తి ప్రస్తుతం ఈ రావి చెట్టు మల్లి చిగురించటానికి నెల నుంచి 3 నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. ఆలయాలకు ఇలా తిరిగి బ్రతికించిన చెట్లను ఇస్తామంటున్నారు.
మనిషి ప్రాణాల మీదకు వచ్చి అత్యవసరం ఉంటే వారికి ఐసియులో ఉంచి చికిత్స చేస్తున్నట్లు.. ఇప్పుడు చెట్లకు పునరుజ్జివింప చేసే అవకాశం దొరకటం నిజంగా మనిషి చేసుకున్న పుణ్యం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..