ఇకపై ఏపీలో ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్ తప్పనిసరి అని భూగర్భ గనుల శాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి వెల్లడించారు. ఇందుకోసం మైనింగ్ శాఖ అధికారులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్దం చేశారని ఆయన తెలిపారు. ఇప్పటిదాకా ఇతర మినరల్స్‌కు అనుమతులు ఇచ్చేందుకు ఈ-అర్మిట్ విధానాన్ని అమలు చేశామని.. ఇకపై ఇసుక తవ్వకాలకు కూడా ఇదే విధానాన్ని వర్తింపజేస్తామన్నారు.
రాష్ట్రంలో రీచ్‌ల వారీగా ఇసుక తవ్వకాలు జరిపేందుకు ఇకపై ఆన్‌లైన్ ద్వారా ఈ-పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆయా దరఖాస్తులను మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్‌లు పరిశీలించిన తర్వాత డీఎంజీ కార్యాలయం నుంచి ఈ-పర్మిట్‌ను జారీ చేస్తామని వీజీ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ-పర్మిట్ ద్వారా మైనింగ్ సమాచారం ఖచ్చితంగా తెలుస్తుందని, అంతేకాకుండా ఆన్‌లైన్‌లో నమోదవుతున్న వివరాలలో పారదర్శకత, జవాబుదారీతనం వస్తుందన్నారు.
రెప్పపాటులో ఊహించని యాక్సిడెంట్.. కుక్క ఓవర్ స్పీడ్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే! వైరల్ వీడియో
ఆ వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావలెను.. నవ్వులు పూయిస్తున్న వధువు పెళ్లి ప్రకటన..
వీడు మామూలోడు కాదు.. సెహ్వాగ్, డివిలియర్స్‌ను మించిపోయాడు.. 20 బంతుల్లో సెంచరీ బాదేశాడు..