Duvvada Srinivas: అటా.. ఇటా.. రచ్చ రచ్చ.. దువ్వాడ ఫ్యామిలీ సర్కస్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..

|

Aug 10, 2024 | 1:02 PM

Duvvada Srinivas Family Controversy: టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతోంది.. నిన్న రాత్రి మొదలైన రచ్చ.. శనివారం కూడా కొనసాగుతోంది.. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట అతని భార్య, పిల్లల ఆందోళన కనసాగుతోంది.. ఇదిలాఉంటే.. శుక్రవారం అర్థరాత్రి ఇంట్లోకి దూసుకెళ్లారు భార్య వాణి, కూతురు హైందవి..

Duvvada Srinivas: అటా.. ఇటా.. రచ్చ రచ్చ.. దువ్వాడ ఫ్యామిలీ సర్కస్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..
Duvvada Srinivas Family Controversy
Follow us on

Duvvada Srinivas Family Controversy: టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతోంది.. నిన్న రాత్రి మొదలైన రచ్చ.. శనివారం కూడా కొనసాగుతోంది.. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట అతని భార్య, పిల్లల ఆందోళన కనసాగుతోంది.. ఇదిలాఉంటే.. శుక్రవారం అర్థరాత్రి ఇంట్లోకి దూసుకెళ్లారు భార్య వాణి, కూతురు హైందవి. గేట్లు పగలగొట్టి, ఇంటి తలుపులు కట్టర్‌తో కట్ చేయించి.. ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో.. భార్య, కూతురుతో దువ్వాడ సోదరులు వాగ్వాదానికి దిగారు. తన డబ్బులతో కట్టిన ఇంట్లో ఎలా ఉంటావని ప్రశ్నించారు భార్య. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవాలన్నారు. తమ సొంత డబ్బుతోనే ఇల్లు కట్టుకున్నామన్నారు దువ్వాడ సోదరుడు శ్రీధర్. తన సోదురుడి ఇంట్లోనే తాను ఉంటున్నానని శ్రీనివాస్ కూడా వాగ్వాదానికి దిగారు. భార్య, పిల్లలతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. నా ఇంట్లో చొరబడ్డ దొంగలంటూ.. బూతులతో విరుచుకుపడ్డారు దువ్వాడ.

భార్య, కూతురిపై దాడికి ప్రయత్నించడంతో.. దువ్వాడను అడ్డుకున్నారు పోలీసులు. అధికార పార్టీ అండతో.. తన ఇల్లంతా ధ్వంసం చేశారని, మారణాయుధాలతో వచ్చి దాడి చేశారని ఆరోపించారు దువ్వాడ శ్రీనివాస్. తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్థరాత్రి దువ్వాడ ఇంటి ముందు బైఠాయించడంతో పాటు.. రాత్రంతా అక్కడే నిద్రించారు భార్య, కూతురు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదన్నారు.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ సంచలన ఆరోపణలు

ఇదిలాఉంటే.. శనివారం కూడా టెక్కలిలో దువ్వాడ ఇంటి దగ్గర భార్య ఆందోళన కొనసాగుతోంది.. ఈ క్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపడానికి నా భార్య వాణి ప్రయత్నిస్తోందన్నారు. తనను చంపడానికి కత్తులు, రాడ్లతో వచ్చారని.. తనను చంపి నా ఇంటిని లాక్కోడానికి కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. అధికార పక్షం అండతో తనపై కుట్ర చేస్తున్నారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని దువ్వాడ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

మా ఇల్లు కాబట్టే కట్టర్లతో డోర్‌ కట్‌ చేశాం: వాణి..

దువ్వాడ శ్రీనివాస్‌ ఆరోపణలను వాణి తిప్పికొట్టారు.. ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉందో అర్థమవుతోందన్నారు. ఇదంతా పిల్లలపై ప్రభావం చూపుతుందని.. శ్రీనివాస్‌ ఇష్టానుసారం చేస్తానంటే ఊరుకోనంటూ హెచ్చరించారు. మా ఇల్లు కాబట్టే కట్టర్లతో డోర్‌ కట్‌ చేశామని.. వాణి పేర్కొన్నారు. హత్యాయత్నం ఎవరు ఎవరిమీద చేశారో కనిపిస్తోందని.. 2022 అక్టోబర్‌లో మాధురి అంశం తెలిసిందని చెప్పారు. అప్పటివరకు మాధురి ఎవరో తనకు తెలియదన్నారు. విడాకులు నోటీసు ఇస్తే ఇవ్వనీయండి.. చూద్దాం అంటూ పేర్కొన్నారు.

మాధురి ఏమన్నారంటే..

భర్తతో ఉండాలనే ఆలోచన వాణికి లేదనీ, టికెట్‌, అధికారం, డబ్బు కోసమే ఆరాటమని మాధురి చెప్పారు. తనను బయటకు లాగితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..