
Dussehra Holidays 2023: దసరాలు హాలిడేస్ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్. స్కూల్స్, కాలేజీలకు పండుగ సెలవులు ఖరారు చేసింది. మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అక్టోబర్ 14వ తేదీ నుంచి దసరా హాలిడేస్ ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు ప్రకటించింది. ఈ సెలవులు అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు ఉంటాయి. 24వ తేదీ నుంచి స్కూల్స్, కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇక స్కూళ్లకు సంబంధించిన వివరాలను 2023-24 అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొనడం జరిగింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు స్కూల్ విద్యార్థులకు ఎస్‌ఏ-1 పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 8 తరగతి మినహా మిగతా అన్ని తరగతులకు ఉదయం సమయంలోనే ఎగ్జామ్స్ నిర్వహించాలని ఆదేశించింది విద్యాశాఖ. ఇక పోతే క్రిస్మస్ సెలవులను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. క్రిస్మస్ సెలవులను 7 రోజుల నుంచి 5 రోజులకు తగ్గించారు. ఇక జనవరి 12వ తేదీ నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు.
తెలంగాణలో కూడా విద్యాసంస్థలకు దసరా సెలవులను ఖరారు చేశారు. స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. అక్టోబర్ 14వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు సెలవుల ఇచ్చారు. తిరిగి అక్టోబర్ 26వ తేదీ నుంచి స్కూల్స్ రీఓపెన్ అవనున్నాయి. సంక్రాంతి సెలవులు జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉండన్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..