AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పగలు తండ్రి దగ్గర.. రాత్రి తల్లి దగ్గర.. చివరకు నీటి కుంటలో శవమై కనిపించిన ప్రభు కిరణ్..

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మోరంపూడిలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల నుంచి వచ్చిన ఆరేళ్ల ప్రభు కిరణ్ స్నేహితులతో కలిసి చేపలు పట్టేందుకు నీటి కుంటలోకి దిగినట్లు సమాచారం. ఆ తర్వాత బాలుడు కనిపించకుండా పోవడంతో పోలీసులు గాలింపు చేపట్టగా, కుంటలో తూడికాడ తొలగించడంతో మృతదేహం బయటపడింది. బాలుడు ప్రమాదవశాత్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పగలు తండ్రి దగ్గర.. రాత్రి తల్లి దగ్గర.. చివరకు నీటి కుంటలో శవమై కనిపించిన ప్రభు కిరణ్..
Six Year Old Boy Death
T Nagaraju
| Edited By: |

Updated on: Oct 01, 2026 | 6:26 PM

Share

తల్లిదండ్రుల మధ్య విబేధాలు వచ్చాయి. ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. దుగ్గిరాల మండలం మోరంపూడికి చెందిన కిరణ్, సునీతకు ఇద్దరూ కుమార్తెలు.. ఆరేళ్ళ బాబు ఉన్నాడు. మూడేళ్ళుగా విడివిడిగా ఉండటంతో ప్రభు కిరణ్ ఉదయం తండ్రి దగ్గర, రాత్రి తల్లి దగ్గర ఉంటున్నాడు. మంగళవారం స్కూలుకు వెళ్ళిన ప్రభు కిరణ్ తిరిగి రాలేదు. దీంతో కిరణ్, సునీతలు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎస్సీ కాలనీ సమీపంలోని నీటి కుంటలో తూడికాడను తొలగించగా బాలుడి శవం బయటపడింది.

మంగళవారం స్కూలు నుండి వచ్చిన ప్రభుకిరణ్ కాలనీలోనే తోటి స్నేహితులతో కలిసి ఆడుకున్నాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న నీటి కుంటలో చేపలు పట్టేందుకు దిగారు. పిల్లలు నీళ్ళలోకి దిగటాన్ని గమనించిన పెద్దలు మందలించారు. దీంతో కొంతమంది కుంటలో నుండి పైకి వచ్చారు. ఈ క్రమంలోనే ప్రభుకిరణ్ కుంటలో నుండి నీరు బయటకు వెళ్ళే తూము ఉండగా దానిలో నుండి బయటకు వెళ్ళే ప్రయత్నం చేసినట్లు భావిస్తున్నారు. ప్రవాహం అధికంగా ఉండటంతో బాలుడు కొట్టుకుపోయి చనిపోయి ఉంటాడని అనుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని తోటి పిల్లలు గమనించారో లేదో తెలియటం లేదు. దీంతో ప్రమాదవశాత్తే జరిగినట్లు అనుకుంటున్నారు.

బాలుడి అదృశ్యం విషాదాంతంగా మారడంతో కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. భార్యాభర్తలు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న నేపధ్యంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలుడు ప్రమాదవశాత్తే కొట్టుకుపోయాడా లేక ఏమైనా జిరిగిందా అన్న అంశం పోస్టుమార్టం నివేదిక తర్వాత తేలనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us