Andhra Pradesh: ఇంట్లో ప్రియుడితో దొరికిపోయిన భార్య.. భర్త ఏం చేశాడంటే?

|

Jan 18, 2024 | 1:40 PM

టూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెంకు చెందిన అర్జునరావుకు అదే గ్రామానికి చెందిన యువతితో కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. అయితే వివాహితకు గ్రామంలో పనిచేసే లైన్ మెన్ రూఫ్ కుమార్ నాయక్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది.

Andhra Pradesh: ఇంట్లో ప్రియుడితో దొరికిపోయిన భార్య.. భర్త ఏం చేశాడంటే?
Murder
Follow us on

 

వివాహేతర సంబంధం ఆ ఇద్దరి మధ్య ఘర్షణకు కారణమైంది. కత్తి, గొ డ్డలితో ఒకరిపై మరొకరు దాడికి పాల్పడేదాకా తీసుకొచ్చింది. ఈ పరస్పర దాడిలో ఒకరి చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మహిళ మాత్రం అక్కడి నుండి పారిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెంకు చెందిన అర్జునరావుకు అదే గ్రామానికి చెందిన యువతితో కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. అయితే వివాహితకు గ్రామంలో పనిచేసే లైన్ మెన్ రూఫ్ కుమార్ నాయక్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పుడప్పుడు నాయక్ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. బుధవారం (జనవరి 18) మధ్యాహ్నం అర్జున రావు ఇంట్లో లేని సమయంలో రూఫ్ కుమార్ నాయక్ ఇంటికి వచ్చాడు. ఇద్దరూ ఇంటిలో ఉన్న సమయంలోనే అర్జున రావు ఇంటికి వచ్చాడు. ఇంటిలో ఇద్దరూ ఉన్నట్లు గమనించిన అర్జున రావు తలుపు కొట్టాడు. తర్వాత ఇంటిలోనే ఉన్న గొడ్డలి తీసుకొని తలుపు వద్ద నిలబడ్డాడు. తలుపు తీయగానే ఇంటిలోకి వెళ్లిన అర్జున రావు భార్య, నాయక్ తో ఘర్షణ పడ్డాడు. అర్జున రావు చేతిలో గొడ్డలి చూసిన నాయక్ ఇంటిలో కత్తిపీట తీసుకున్నాడు. ఇద్దరూ ఒకే సమయంలో దాడికి పాల్పడ్డారు.

అర్జున రావు గొడ్డలితో రూఫ్ కుమార్ నాయక్ పై దాడి చేయగా, నాయక్ కత్తిపీటతో అర్జున రావుపై దాడి చేశాడు. ఈ దాడి జరుగుతుండగానే అర్జున రావు భార్య అక్కడి నుండి పారిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో నాయక్ అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన అర్జున రావు ఇంటిలోనే పడిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు చేరుకునే సమయానికి అర్జున రావు రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. మరొకవైపు నాయక్ మృత దేహాన్ని పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం జిజిహెచ్ కు తరలించారు. అర్జున రావు భార్య మాత్రం ఘటన స్థలంలో పోలీసులకు కనిపించలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..