ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఓ రేంజ్ లో సాగుతుంది. అధికార వైసీపీ నేతల.. జనసేన నేతల నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా అంటూ ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకుంటున్నారు. తాజాగా ఏపీలోని వైసీపీ పాలనపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణదెల నాగబాబు స్పందించారు. పోలవరం ప్రాజెక్టును అటకెక్కించారని విమర్శించారు. దీనికి సంబంధించి ‘కథాకళి-2’ పేరిట ఆయన ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అటు.. దుబాయ్‌లో నాగబాబుకు జనసైనికులు ఘనస్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగు, తాగునీటితో పాటు వేల కోట్ల ఆదాయ వనరులను అందించే అక్షయ పాత్ర వంటి పోలవరం ప్రాజెక్టుని ప్రభుత్వం గాలికి వదిలేసిందని నాగబాబు విమర్శించారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి వేములపాటి అజయకుమార్ మధ్య జరిగిన సంభాషణతో వీడియో విడుదల చేశారు నాగబాబు. ఈ సందర్భంగా.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా ఏపీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో పోలవరం పనులు జరగవని, ఆగిపోయినట్టేనని, చాలా బాధగా ఉందని అన్నారు. పోలవరం పూర్తైతే మూడు పంటలు పండుతాయని, లక్ష కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని.. కానీ ఇప్పుడు పూర్తైయ్యే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీతి, నిజాయితీ, రైతులు పట్ల ప్రేమ ఉన్న నాయకుడు పవన్ కల్యాణ్ నాయకత్వంలో పోలవరం కడతారని, ప్రజలు ఆనదంగా ఉంటారని వేములపాటి అజయ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
వైసీపీ పాలనలో అటకెక్కిన పోలవరం – కథాకళి ఎపిసోడ్ – 2
రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయ వనరులను, యువతకు ఉద్యోగాలను అందించే అక్షయ పాత్ర పోలవరం ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్ట్ పూర్తిచేయకుండా, గాలికొదిలేసి రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది @YSRCParty ప్రభుత్వం – @JanaSenaParty ప్రధాన… pic.twitter.com/12OYs8rUQY— JanaSena Party (@JanaSenaParty) May 25, 2023
ఇక మరోవైపు.. మూడు రోజుల పర్యటనలో భాగంగా దుబాయ్ వెళ్లారు నాగబాబు. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో నాగబాబుకి ఘనస్వాగతం లభించింది. దుబాయ్ పర్యటనలో భాగంగా.. నేటి నుండి 28 వరకు దుబాయ్ వేదికగా జరగనున్న సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్ దేశాల్లో స్థిరపడిన జన సైనికులు, వీర మహిళలు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే.. కథాకళి-2 పేరుతో ప్రత్యేక వీడియోను విడుదల చేశారు నాగబాబు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..