
ఈశాన్య బీహార్ నుంచి దక్షిణ ఒడిశా వరకు వ్యాపించిన ద్రోణి ప్రస్తుతం తన స్థానాన్ని మార్చుకుని జార్ఖండ్ నుంచి విదర్భ వరకు ఛత్తీస్‌గఢ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. అదే సమయంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాల్లో నైరుతి, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు ప్రధానంగా పొడి వాతావరణం కొనసాగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో శుక్రవారం, శనివారం పొడి వాతావరణం కొనసాగనుండగా, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం శుక్ర, శని, ఆదివారాల్లో ఎల్లుండి కూడా పొడి వాతావరణమే కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదే పరిస్థితి రాయలసీమలో కూడా కనిపించనుంది. అక్కడ కూడా వచ్చే మూడు రోజుల పాటు ఎలాంటి వర్ష సూచనలు లేకుండా పొడి వాతావరణమే ఉండే అవకాశముందని తెలిపారు. ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే నాలుగు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని అంచనా. అయితే తదుపరి మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..