దొంగతనానికి ప్లాన్ చేసేటప్పుడు ఎంట్రీ ఎలా ఉండాలి, ఎగ్జిట్ ఎలా అవ్వాలి, ఎస్కేప్ అవ్వడానికి ఏయే దారులున్నాయ్.. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ఏం చేయాలి.. అని పక్కాగా ప్లాన్ చేసి చోరీలు చేస్తారు దొంగలు. కానీ ఇక్కడ ఒక దొంగ…. దొంగతనం చేయడం ఒక్కటే తన టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఎలా ఎస్కేప్ అవ్వాలో తెలియక సలభంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని దొంగిలించాడు ఓ దొంగ. నకిలీ తాళాలతో బైక్‌ను అయితే చోరీ చేశాడు కానీ ఎక్కడికి వెళ్లాలి??? ఎలా వెళ్లాలి??? అనే లాజిక్ మిస్ అయ్యాడు. దీంతో పారిపోయే క్రమంలో ఎటు వెళ్లాలో తెలియక ఓ కిరాణా షాపులోకి బైక్‌తో సహా దూరిపోయాడు.
మామిళ్ల కుంట క్రాస్ వద్ద షాపులోకి దూరిన దొంగ… ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.ౌ
దొంగతనం చేయడానికి ధైర్యం కోసం మందు అయితే తాగాడు…. కానీ ఆ బైకును దొంగతనం చేసి ఎలా తీసుకెళ్లాలో??? ఎటు పారిపోవాలో తెలియక…. ఓ వైపు జనం వెంట పడుతుంటే ఏకంగా ఓ కిరాణా షాపులోకి దూరిపోయాడు. ఇంకేముంది స్థానికులు, షాపు నిర్వాహకుడు దొంగను పట్టుకొని ఆరాతీస్తే అసలు విషయం తెలిసింది. దొంగతనం చేసి పారిపోయే క్రమంలో దొరికిపోయిన దొంగ అని తెలిసింది. దీంతో స్థానికులు దొంగను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. బైక్ చోరి అయితే పర్ఫెక్ట్‌గానే చేశాడు… కానీ ఎస్కేప్ అవ్వడంలో ఫెయిల్ అయ్యి…. భలే విచిత్రంగా దొరికాడు. స్థానికులు దొంగ తీరుతో నవ్వుకుంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పుట్టపర్తి రూరల్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే మద్యంలో మత్తులో ఉండటంతో.. సెలెన్సర్ అంటుకుని అతడి ఒళ్లు కాలిపోయింది. దీంతో పోలీసులు ఆస్పత్రికి తరలించి.. ప్రాథమిక చికిత్స అందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..