Viral: వింత సంఘటన.. వేప చెట్టు నుంచి కారుతున్న పాలు.!
అన్నమయ్య జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. వీరబల్లి మండలం ఓదివీడులో చెట్టు నుంచి ఏకధాటిగా పాలు కారుతున్నాయి. ఎర్రం రాజుగారి పల్లె ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఈ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. 30ఏళ్ల వయసున్న వేపచెట్టు నుంచి పాలు ఉబికి వస్తున్న దృశ్యాన్ని స్థానికులు వింతగా చూస్తున్నారు. గ్రామంలో మునుపెన్నడూ ఇలాంటి వింతలు చూడలేదని వారంటున్నారు ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో ప్రజలు అధిక సంఖ్య చూడటానికి వస్తున్నారు.
అన్నమయ్య జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. వీరబల్లి మండలం ఓదివీడులో చెట్టు నుంచి ఏకధాటిగా పాలు కారుతున్నాయి. ఎర్రం రాజుగారి పల్లె ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఈ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. 30ఏళ్ల వయసున్న వేపచెట్టు నుంచి పాలు ఉబికి వస్తున్న దృశ్యాన్ని స్థానికులు వింతగా చూస్తున్నారు. గ్రామంలో మునుపెన్నడూ ఇలాంటి వింతలు చూడలేదని వారంటున్నారు ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో ప్రజలు అధిక సంఖ్య చూడటానికి వస్తున్నారు. కొందరు ఇది దేవుడి మహిమ అంటూ ఆ ద్రవాన్ని ప్రసాదంగా పాత్రల్లో నింపుకుని ఇళ్లకు తీసుకెళ్తున్నారు. పైగా దానిని సేవిస్తే.. ఎటువంటి రోగాలు రావని కూడా అంటున్నారు. ఈ వింతను చూడ్డానికి పెద్ద ఎత్తున ఆ చెట్టు దగ్గర గుమిగూడారు. ఆ చెట్టుకు పూజలు కూడా చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
వైరల్ వీడియోలు
Latest Videos