
సంగీతంలో అనేక వాయిద్యాలు ఉన్నాయి.. వాటిలో ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో ఫేమస్ అలాగే మనకి డ్రమ్స్ పేరు చెప్పగానే మొదటిగా గుర్తుకు వచ్చేది చెన్నైకు చెందిన శివమణి.. తలకు గుడ్డ కట్టుకుని ఒళ్లంతా డ్రమ్స్ పెట్టుకొని వాటిని ఎలా వాయిస్తారో అందరికీ తెలిసిందే.. అయితే ఆయన ఎప్పటినుంచో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కడప లోని అమీన్ పీర్ దర్గాను దర్శించుకుంటారు.. దానికి కారణము లేకపోలేదు.. అసలు ఇంతకు శివమణి అమీన్ పీర్ దర్గాకు ఎందుకు వచ్చారో తెలుసుకుందాం..
ప్రముఖ సంగీత డ్రమ్స్ విధ్వాంసుడు శివమణి అందరికీ తెలిసినవారే.. కడపలోని దర్గాను దర్శించుకుని ఆయన నిన్న కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ తల్లి గారి సూచనతో ఈ దర్గాకు వచ్చిపోతూ ఉంటానని నాకు అంతా మంచి జరిగిందని ఆయన అన్నారు. నా మహాలీలా సీడీలు దర్గాలు తీసుకువచ్చి ఆశీస్సులు తీసుకున్నానని అది మంచి సక్సెస్ అయిందన్నారు. త్వరలోనే మహాలీల 2 రాబోతుందని మరోసారి అమీర్ పీర్ దర్గా కు వచ్చి ఆశీస్సులు తీసుకుంటారని శివమణి తెలిపారు.
మన దేశంలోని వారు పర్యాటక కోసం విదేశాలకు వెళ్ళవద్దని అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు మంచి వాతావరణం పరిస్థితులు మన దేశంలోనే అనేకం ఉన్నాయని శివమణి అన్నారు. గండికోట ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ఆయన తన ప్రదర్శనను ఇక్కడ చేయనున్నారు.. అందులో భాగంగా శివమణి కడపకు వచ్చారు. కడప అమీన్ పీర్ దర్గాను దర్సించుకున్నారు. దర్గా నిర్వాహకులు శివమణిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనంతరం శివమణి చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..