దస్తగిరి వ్యాఖ్యల శైలిపై అనుమానాలు.. స్మార్ట్ గా వ్యవహరిస్తున్నాడా అని సందేహాలు

|

Feb 23, 2022 | 12:07 PM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా(YS Viveka) హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. కోర్టుకు రెండుసార్లు వాంగ్మూలం కూడా ఇచ్చాడు. కానీ ఈ ఎపిసోడ్‌ వెనుక చాలా కథ నడిచినట్లు క్లియర్‌ గా,,

దస్తగిరి వ్యాఖ్యల శైలిపై అనుమానాలు.. స్మార్ట్ గా వ్యవహరిస్తున్నాడా అని సందేహాలు
Follow us on

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా(YS Viveka) హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. కోర్టుకు రెండుసార్లు వాంగ్మూలం కూడా ఇచ్చాడు. కానీ ఈ ఎపిసోడ్‌ వెనుక చాలా కథ నడిచినట్లు క్లియర్‌ గా తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీల్లో తేడాలతో దస్తగిరి తనదైన శైలిలో స్క్రీన్‌ ప్లే నడిపిస్తున్నాడా..? మిగతా వాళ్లను ఒత్తిడి గురయ్యేలా స్మార్ట్‌గా వ్యవహరిస్తున్నాడా..? అనే అనుమానం వ్యక్తమవుతోంది. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన తర్వాత తనకు ప్రాణహాని ఉందంటూ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొంతమంది ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ చెప్పాడు. ప్రాణహాని ఉందంటూనే, ముడుపులు ముట్టజెప్పే ప్రయత్నాలు జరిగాయని దస్తగిరి వాదిస్తున్నాడు.

తాజాగా బయటికొచ్చిన ఓ ఆడియోలో.. దస్తగిరి భరత్‌ యాదవ్‌తో మాట్లాడాడు. తను ఏమనుకుంటున్నాడనే విషయాలన్నింటినీ అతనితో పంచుకున్నాడు. అయితే అందులో బెదిరింపులు గానీ, ప్రాణహానీ గానీ ఉన్నట్టు ఎక్కడా కనిపించలేదు. దీన్ని బట్టి చూస్తుంటే దస్తగిరి మాటల్లో ఏదో అంతరార్థం ఉన్నట్లు కనిపిస్తోంది. మరో వైపు కోర్టుకు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో ఎవరెవరి పేర్లు వెల్లడించాడనేది హాట్ టాపిక్ గా మారింది.

తన భార్య బిడ్డలు అనాధలు కాకూడదనే అప్రూవర్ గా మారి సీబీఐ ముందు నిజాలను చెప్పానన్నాడు దస్తగిరి. అప్రూవర్ స్టేట్ మెంట్ ఇవ్వక ముందు కొన్ని బెదిరింపులు వచ్చాయన్న దస్తగిరి.. మొదటి అప్రూవర్ స్టేట్ మెంట్ తరువాత కూడా కొంతమంది కలిశారని, ఆ విషయం కూడా సిబిఐకి చెప్పానన్నాడు. వివేకా హత్యకేసుకు సంబంధించి డీల్‌లో.. మున్నా అకౌంట్ లో వేసినవి తప్ప .. తనకు రూపాయి కూడా అందలేదన్నాడు.

Also Read

Viral Video: యూపీలో ఆసక్తికర దృశ్యం.. ప్రియాంకా గాంధీతో BJP కార్యకర్తలు సెల్ఫీలు

Viral News: ట్రెండీ లుక్‌లో తళుక్కుమన్న మెరుపు తీగ రీనా ద్వివేది.. కొంచెం మార్పు అవసరమంటూ..

విజయ్‌ దేవరకొండ పిరికోడు !! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ !! వీడియో