Donkey’s milk: బాబోయ్‌..! గాడిద పాలకు భలే గిరాకీ.. లీటర్‌ ధర పదివేలకు చేరువగా..!!

| Edited By: Jyothi Gadda

Aug 23, 2023 | 8:48 PM

హిందూపురం చుట్టుపక్కల గ్రామాలకు పొద్దున్నే గాడిదలను తోలుకొచ్చి ఇంటి ముందే పాలు పితికి ఇస్తున్నారు... సాధారణంగా పిల్లలు పుట్టిన తరువాత వారికి గాడిద పాలు పోస్తుంటారు. ఇది చాలా కాలంగా వస్తోంది. గాడిద పాలు తాగిస్తే చురుగ్గా ఉంటారని.. మాటలు బాగా వస్తాయని నమ్ముతారు. కానీ కాల క్రమంలో ఇది మరుగన పడింది. కానీ ప్రస్తుతం కొందరు ఈ పాత విషయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి.. గాడిద పాలకు ఎక్కడా లేని డిమాండ్ సృష్టించారు...

Donkey’s milk: బాబోయ్‌..! గాడిద పాలకు భలే గిరాకీ..  లీటర్‌ ధర పదివేలకు చేరువగా..!!
Donkey's Milk
Follow us on

అనంతపురం, ఆగస్టు 23: గంగి గోవుపాలు గరిటడైనా చాలు.. కడవడైన నేమి ఖరముపాలు.. ఈ సామెత మనం చిన్నప్పుడు విన్నాం కదా…. అయితే ఇప్పుడు ఇది రివర్స్ అయింది. గోవుపాలు వంద లీటర్లు ఉన్నా ఏమీ ప్రయోజనం.. గాడిద పాలు గుక్కెడుంటే కాసుల వర్షమే. అదేంటి గాడిద పాలు అంత రేటు ఏంటి అనుకుంటున్నారా??? అదే అసలు సీక్రెట్. గాడిద పాల కోసం ఏకంగా ఫామ్ ఏర్పాటు చేశారంటే.. గాడిద పాలకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. అసలు గాడిద పాలు వేల రూపాయలు ఎందుకు పలుకుతోంది.. ఆ సీక్రెట్ ఏంటి…

ఏదైనా తప్పు చేస్తే.. గాడిద అని తిడుతాం…. కానీ ఇప్పుడు అదే గాడిద కొందరికి కాసులు కురిపిస్తోంది. మీరు విన్నది నిజమే. గాడిదలు కాసు వర్షం కురిపించడం ఏంటా అని డౌట్ రావొచ్చు…..ఇప్పుడు గాడిద పాలకు ఒక రేంజ్ డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా ఆవు పాలు మార్కెట్ లో ఎంత ఉంటాయి.. బాగా చిక్కగా ఉంటే.. 60 నుంచి 80రూపాయలు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం గాడిద పాలు ఏకంగా 7వేల రూపాయలు ధర పలుకుతోంది. హిందూపురం చుట్టుపక్కల గ్రామాలకు పొద్దున్నే గాడిదలను తోలుకొచ్చి ఇంటి ముందే పాలు పితికి ఇస్తున్నారు… సాధారణంగా పిల్లలు పుట్టిన తరువాత వారికి గాడిద పాలు పోస్తుంటారు. ఇది చాలా కాలంగా వస్తోంది. గాడిద పాలు తాగిస్తే చురుగ్గా ఉంటారని.. మాటలు బాగా వస్తాయని నమ్ముతారు. కానీ కాల క్రమంలో ఇది మరుగన పడింది. కానీ ప్రస్తుతం కొందరు ఈ పాత విషయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి.. గాడిద పాలకు ఎక్కడా లేని డిమాండ్ సృష్టించారు…

ప్రస్తుతం హిందూపురం ప్రాంతంలో గాడిద పాలు లీటర్ ఏడు వేల రూపాయలకు అమ్ముతున్నారు. పిల్లలకు పాలు ఇవ్వాలంటే ఏకంగా గాడిదలను ఇంటి వద్దకు తీసుకొచ్చి.. అక్కడే పితికి ఇస్తున్నారు. చాలా కాలనీల్లో గాడిదలు తీసుకుని.. గాడిద పాలు అమ్ముతాం అంటూ ప్రచారం చేస్తున్నారు. ఒక పాలపీకలోకి పాలు కావాలంటే వంద రూపాయలంట…. పాలపీకలో ఎన్ని పాలు పడతాయి… 50 ఎం.ఎల్ లోపే ఉంటాయి. అంటే ఊహించుకోండి గాడిదపాలకు ఎంత డిమాండ్ ఉందో…

ఇవి కూడా చదవండి

గాడిద పాలకు డిమాండ్ ఎక్కువ కావడంతో.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన రాజు అనే వ్యక్తి గాడిదలు తోలుకొని వీధి వీధి తిరుగుతున్నాడు. కర్ణాటక ప్రాంతంలో సుమారు 25 గాడిదలతో ఒక ఫామ్ కూడా ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి హిందూపురంతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఈ పాలను విక్రయిస్తున్నారు.

అయితే గాడిద పాలలో ఇన్ని ఔషద గుణాలు ఉన్నాయన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.. పిల్లలు, పెద్దలు గాడిద పాలు తాగితే ఉబ్బసం, గ్యాస్ట్రిక్, మోకాళ్ళ నొప్పులు, పచ్చకామెర్లు తదితర రోగాలు నయమైతాయని అంటున్నారు. కంప్యూటర్ యుగంలో కాలం చెల్లిన పోకడలు ఏంటని వైద్యులు అంటుంటే…. గాడిద పాలలో ఎన్నో ఔషధ గుణాలు, రోగ నిరోధక శక్తిని పెంచుతాయని మరికొందరంటున్నారు.

ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గాని…. లీటరు గాడిద పాలు మాత్రం ఏడు వేలకు అమ్మతున్నారన్నది నిజం…. ప్రస్తుతం గాడిద పాలకు ఇంత గిరాకీ ఏర్పడటం ఆశ్చర్యం కల్గిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..