AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heartwarming Video: పంది పిల్లలకు పాలిచ్చి.. మాతృత్వం చాటుకున్న శునకం.. వీడియో..

జాతి వైర్యం పక్కన పెట్టి ఆకలితో ఉన్న పంది పిల్లలకు పాలు పట్టింది శునకం. తన మాతృత్వాన్ని చాటుకుంది. అమ్మతనం గొప్పతనంను ఈ ప్రపంచానికి చూపించింది. పంది పిల్లలకు కడుపు నిండా పాలు తాగించింది.

Heartwarming Video: పంది పిల్లలకు పాలిచ్చి.. మాతృత్వం చాటుకున్న శునకం.. వీడియో..
Dog Pig
Sanjay Kasula
|

Updated on: Dec 15, 2021 | 6:02 PM

Share

Dog Gives Milk to Piglets Video: పేరులోనే ప్రేమని.. పిలుపులోనే ఆ మాధు ర్యాన్ని నింపుకున్న అమృతమూర్తి అమ్మ. సృష్టిలో ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన వరం అమ్మ. అమ్మ లేకపోతే జననం లేదు. అమ్మ లేక పోతే సృష్టిలో జీవం లేదు. ఆ అమ్మ లేక పోతే అసలు సృష్టే లేదు. అందులో అమ్మతనం మరెంతో గొప్పది. ప్రతి జీవి అమ్మ ప్రేమకు దాసోహామే అంటాడో ఆ మహా కవి. అమ్మకు తన మన అనే భేదము ఉండదు. సాధారణంగా ఎవరైనా చంటి బిడ్డ ఆకలితో ఏడిస్తే.. ముందుగా కదిలిపోయేది అమ్మ. ఆ బిడ్డ తన బిడ్డ కాకపోయినా పాలు పట్టించిన దేవతామూర్తులు ఎందరిని మన చూశాం. ఇలాంటి ఘటనే ఒకటి తూర్పుగోదావరి జిల్లా చోటు చేసుకుంది. అయితే ఇక్కడ అమ్మ పాత్ర పోషించింది మాత్రం గ్రామ సింహం శునకం. జాతి వైర్యం పక్కన పెట్టి ఆకలితో ఉన్న పంది పిల్లలకు పాలు పట్టింది శునకం. తన మాతృత్వాన్ని చాటుకుంది. అమ్మతనం గొప్పతనంను ఈ ప్రపంచానికి చూపించింది. పంది పిల్లలకు కడుపు నిండా పాలు తాగించింది. అవి తాగుతున్నంత సేపు ప్రశాంతంగా ఉంది.

పంది పిల్లలకు పాలు పట్టిన ఘటన తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రి రావు పేట గ్రామంలో జరిగింది.  ఈ సంఘటనను ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. జక్కమ్మ చెరువు ప్రాంతంలో పందులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి.

అదే ప్రదేశంలో పలు పంది పిల్లలు ఆకలితో అలమిటిస్తూ కనిపోయించాయి. అక్కడికే ఉన్న శునకం దగ్గరకు వెళ్లి పంది పిల్లలు పాలు తాగుతూ కనిపించాయి. దీంతో చుట్టుపక్క వారంతా ఆశ్చర్యంగా చూస్తుండి పోయారు.  మమతాను రాగాలు మనుషులకే కాదు.. తమకూ ఉన్నాయని నిరూపించుకుంది ఈ శునకం.

ఇవి కూడా చదవండి: Cow: ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన గోమాత.. రైతు ఇంట్లో పండుగ శోభ..

Aryan Khan: ఆర్యన్‌ ఖాన్‌కు మరింత ఊరట.. ఆ అవసరం లేదన్న బాంబే హైకోర్టు..