Andhra: ఊదుతూ విజిల్ మింగేసిన బాలుడు.. అది ఊపిరితిత్తుల్లోకి వెళ్లింది.. ఆ తర్వాత

ఆడుకుంటూ బాలుడు ఈలను మింగేశాడు. అది గొంతు గుండా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాస తీసుకోవడం కష్టమయింది. బాలుడి కుడివైపు ఊపిరితిత్తిలో ఈల ఉన్నట్లు గుర్తించారు. చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్‌ వెంకటేశ్ ఆ ఈలను బయటకు తీసే బాధ్యత తీసుకున్నారు. తన టీమ్ సాయంతో.....

Andhra: ఊదుతూ విజిల్ మింగేసిన బాలుడు.. అది ఊపిరితిత్తుల్లోకి వెళ్లింది.. ఆ తర్వాత
Boy Stomach Pain (representative image)

Updated on: Jan 30, 2025 | 5:38 PM

పిల్లలకు మంచి ఏదో, చెడు ఏదో తెలియదు. వారికి తెలియకుండా చేసే కొన్ని పనులు ప్రమాదాల్లోకి నెట్టేస్తాయి. తాజాగా నాలుగున్నరేళ్ల బాలుడు అలాంటి పనే చేశాడు. విజిల్ ఊదుతూ ఆడుకుంటున్న బాలుడు.. పరధ్యానంలో దాన్ని మింగేశాడు. దీంతో అది ఊపిరితిత్తుల్లోకి వెళ్లింది. దీంతో చిన్నోడు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడ్ని ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆ విజిల్ బయటకు తీసి.. బాలుడ్ని కాపాడారు.

వివరాల్లోకి వెళ్తే… కోనసీమ జిల్లా రావులపాలేనికి చెందిన రాజు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని సాకుతున్నాడు. అతకి నాలుగున్నరేళ్ల తనయుడు ఐజక్‌ ఉన్నాడు. అయితే ఇటీవల ఇంటి వద్ద ఆ బాలుడు విజల్ ఊదుతూ ఆటలో మునిగిపోయాడు. ఈ క్రమంలోనే గట్టిగా ఊపిరి పీల్చేటప్పుడు…   పొరబాటున నోటిలో ఉన్న విజిల్ గొంతు నుంచి ఊపిరితిత్తిలోకి వెళ్లిపోయింది.

 ఆ తర్వాత బాలుడికి విపరీతంగా దగ్గు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని తండ్రి రాజు గమనించాడు. వెంటనే ఐజక్‌ను తీసుకుని ఈస్ట్ గోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. అనంతరం బాలుడికి ఎక్స్​రే తీసిన డాక్టర్ వెంకటేష్..  ఈల కుడివైపు ఊపిరితిత్తిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బ్రాంకోస్కోపీ ద్వారా దాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడు సేఫ్‌గానే ఉన్నాడని వెంకటేశ్ తెలిపారు. ఊపిరితిత్తుల వద్ద ఇరుక్కుపోయిన ఈలను బయటకు తీయడం చాలా కష్టమైన ప్రక్రియ అన్నారు. అక్కడ చాలా సున్నిత భాగాలు.. ఉండటంతో.. అన్ని జాగ్రత్తలు తీసుకుని..  బ్రాంకోస్కోపీ ద్వారా బయటకు తీసినట్లు తెలిపారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..