శ్రీసత్యసాయి (Sri Satyasai) జిల్లాలో ఆటోపై విద్యుత్ తీగలు తెగిపడి ఐదుగురు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ప్రమాదానికి ఓ ఉడత కారణమని అధికారులు చెప్పారు. కాగా.. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ తీగలకు తగిలి ఉడత అక్కడికక్కడే మృతి చెందింది. ఆ కళేబరాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు దానిని తాడిమర్రి పశువైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఆ వివరాలను బయటకు (Andhra Pradesh) చెప్పకుండా సీక్రెట్ గా దాచి ఉంచడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరెంటు స్తంభంపై ఉడత ఎక్కినప్పుడు షార్ట్‌సర్క్యూట్ అయి మధ్యలో తీగ తెగి అదే సమయంలో అటుగా వస్తున్న ఆటోపై పడిందని ఎస్పీడీసీఎల్ అధికారులు చెప్పారు. అధికారుల ప్రకటనను స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తీగలు నాసిరకంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. నాసిరకం తీగలను మార్చాలని ఎన్నోసార్లు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేద వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ ఘటనపై నిపుణులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభాలపై పక్షులు, ఉడత, తొండలాంటి ప్రాణులు ఎక్కటం సాధారణమేనని, ఉడతలాంటివి తీగలపైకి ఎక్కినప్పుడు షార్ట్‌సర్క్యూట్ అయితే సంబంధిత సబ్‌స్టేషన్‌లో ట్రిప్ అయి సరఫరా నిలిచిపోతుందని చెబుతున్నారు. చిల్లకొండయ్యపల్లి ప్రమాద ఘటనలో ఉడత కారణంగా షార్ట్‌సర్క్యూట్ అయి తీగ తెగింది. ట్రిప్ అయి సరఫరా నిలిచిపోలేదు. తీగ తెగినప్పుడు కరెంటు పోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది.
తాడిమర్రి మండలం గుండంపల్లి, పెద్దకోట్లకు చెందిన ఏడుగురు మహిళా కూలీలు పొలం పనులు కోసం చిల్లకొండయ్యపల్లికి ఆటోలో వెళుతున్నారు. మార్గమధ్యలో కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ మంటలు చెలరేగడానికి కారణమేంటి? వైర్లు ఎలా తెగాయి? అనేది ప్రశ్నగా మారింది, అయితే విద్యుత్ అధికారులు మాత్రం ఆటో ప్రమాదానికి ఉడుత కారణమంటున్నారు. కరెంట్ వైర్లు తెగిన సమయంలో ఉడుత వాటిపై నుంచి ఆటోపై పడిందని.. ఆటోపై ఉన్న గుడారంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని చెబుతున్నారు. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో ఆటో మొత్తం అంటుకుంటుదని అంటున్నారు. లోపల ఉన్న మహిళలు ఐదుగురు సజీవదహనమయ్యారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..