కొవిడ్ కేర్ కేంద్రంలో దీపావళి వేడుకలు, కరోనా బాధితుల్లో కాస్త ఆనందం నింపేందుకు ప్రయత్నం

అసలే దీపావళి..కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషంగా చేసుకునే పండుగ. ప్రస్తుత కరోనా సమయంలో చాలా మంది వ్యాధి బారిన పడి కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స తీసుకుంటున్నారు.

కొవిడ్ కేర్ కేంద్రంలో దీపావళి వేడుకలు, కరోనా బాధితుల్లో కాస్త ఆనందం నింపేందుకు ప్రయత్నం
Follow us

|

Updated on: Nov 14, 2020 | 11:25 PM

అసలే దీపావళి..కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషంగా చేసుకునే పండుగ. ప్రస్తుత కరోనా సమయంలో చాలా మంది వ్యాధి బారిన పడి కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోగుంటూరు సమీపంలోని అడవితక్కెళ్లపాడులోని కొవిడ్ కేర్ సెంటర్​లో శనివారం దీపావళి వేడుకలు జరిగాయి. పండగ వేళ అయినవాళ్లకి దూరంగా ఉన్నామని రోగులు బాధపడకుండా ఉండేందుకు అధికారులు ఈ  ప్రయత్నం చేశారు. ఈ ఆలోచన కొవిడ్ కేంద్రాల్లో యోగా తరగతులు నిర్వహిస్తున్న పతంజలి శ్రీనివాస్​కు రాగా అధికారులతో పంచుకున్నారు. కరోనా బాధితులు భౌతిక దూరం పాటిస్తూనే ఆనందంగా బాణసంచా కాల్చారు. కొవిడ్ కేర్ సెంటర్ ఇంఛార్జ్ పురుషోత్తం, వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏమైనా ఇటువంటి పనులు రోగుల్లో నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో  కొత్తగా 1,657 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,52,955కి చేరింది. ఇందులో 19,757 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,26,344 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 7 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,854కు చేరుకుంది.

Also Read :

ఏపీలో విద్యార్థుల కోసం ప్రత్యేక వెబ్​సైట్.. ఆశయాల వైపు పయనించేలా వినూత్న ఆలోచన

బిగ్ బాస్ 4 : ఇంటి నుంచి మెహబూబ్ ఔట్, అనుకున్నదే జరిగింది