Divvela Madhuri: దివ్వెల మాధురి బిగ్‌బాస్ రెమ్యూనురేషన్ ఎంత?.. దాన్ని ఆమె దేనికి వాడుతున్నారో తెలుసా?

దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి.. ఈ జంట అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు.ఈ లేటు వయసు ఘాటు ప్రేమికులు సోషల్ మీడియా ఇంటర్వ్యూలు, రీల్స్, అనేక కాంట్రవర్షీలతో మస్తు ఫేమస్ అయిపోయారు. దివ్వెల మాధురి ఏ చిన్న రీల్ చేసిన, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దానికి అబ్బో బోలెడన్ని లైక్ లు, ఎంతో మంది ఫాలోవర్సు. ఈ ఫాలోయింగ్ చూసే ఇటీవల ఆమె మా టీవీ నిర్వహిస్తున్న బిగ్ బాస్ షోకి సెలెక్ట్ అయ్యారు. కొద్ది రోజులు బిగ్ బాస్ హౌస్‌లో తన వంతు రోల్ ప్లే చేసి ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌస్ నుంచి ఇటీవల బయటకు వచ్చేశారు. అయితే రెమ్యూనిరేషన్ ఎంత.. దాన్ని ఆమె ఏం చేస్తున్నారో తెలుసా? అయితే తెలుసుకుందాం పదండి.

Divvela Madhuri: దివ్వెల మాధురి బిగ్‌బాస్ రెమ్యూనురేషన్ ఎంత?.. దాన్ని ఆమె దేనికి వాడుతున్నారో తెలుసా?
Divvela Madhuri

Edited By: Anand T

Updated on: Dec 12, 2025 | 8:00 AM

ప్రచార ఆర్భాటం, పాపులార్టీ అంటే ఇష్టపడే దివ్వెల మాధురికి బిగ్ బాస్ షో కి సెలక్ట్ కావటం ఒక మంచి అవకాశమే అని చెప్పవచ్చు. అందుకే బిగ్ బాస్ షో లోకి మాధురి భారీ ఎక్స్ పెర్టేషన్స్ తోనే ఎంట్రీ ఇచ్చింది. ఉన్నన్ని రోజులు మాధురి కాస్త గడుసుగానే ఉంటూ తోటి పార్జిసిపెంట్స్ తో తగువులు పెట్టుకుంటూ ఉండేది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు ఆమె ఉండలేకపోయారు. చివరకు ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లో దివ్వెల మాధురి గడిపిన కొద్ది రోజులకు గాను ఆమెకు భారీ రెమ్యూనరేషన్ నే ముట్టజెప్పారట. ఆమె ఉన్న కొన్ని రోజులకు రూ.9 లక్షలు ఇచ్చారట.

బిగ్‌బాస్‌లో వచ్చిన డబ్బును మాదురి ఏం చేస్తుంది.

దువ్వాడ శ్రీనివాస్,మాధురి జంట గత కొంత కాలంగా ఏం చేసిన సెన్సేషనల్. ఇపుడు బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయటం కూడా మాధురికి మరింత పాపులార్టీని తీసుకువచ్చింది. ఈ పాపులార్టీతో ఆమె సేవా కార్యక్రమాలు వంటివి చేపడుతున్నారు. బిగ్ బాస్ లో తనకు వచ్చిన రెమ్యునరేషన్ డబ్బులను ఆపదలో ఉన్న వారికి దానం చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. గొప్ప మనసున్న వ్యక్తిగా పేరు పొందుతున్నారు. బిగ్ బాస్ షోలో వచ్చిన పారితోషకంతో అనారోగ్యంతో ఇటీవల హాస్పిటల్ పాలైన తన అనుచరుడు లక్ష్మీనారాయణను దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఇటీవల పరామర్శించి వైద్య ఖర్చులు నిమిత్తం రూ.30వేలు అలాగే వ్యాపార నిమిత్తం కిరాణా షాపు నడుపుకొనుటకు రూ.50 వేలు నగదును అందజేశారు.

అలాగే నరసన్నపేట నియోజకవర్గం అల్లాడ గ్రామంలో H.కుమారి అనే మహిళ ప్రేగు క్యాన్సర్ తో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలుసుకొని ఆపరేషన్ ఖర్చుల నిమిత్తమై ఆమెకు లక్షా పదివేల రూపాయలు సహాయం అందించారు. అలాగే శ్రీకాకుళంలో నివాసం ఉంటున్న ఓ వీడియో జర్నలిస్ట్, అతని భార్య రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారి కుటుంబాన్ని పరామర్శించి రూ. 20 వేలు ఆర్ధిక సాయం అందించారు.

అలాగే విశాఖలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటున్న పేద కుటుంబాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులకు కాలేజీ ఫీజ్ కట్టేందుకు కొంత ఆర్ధిక సాయం అందించారు. టెక్కలి లో జరిగిన శ్రీ లక్ష్మీ గణపతి యాగానికి రూ.50 వేలు నగదు అందించారు.ఇలా బిగ్ బాస్ షో ద్వారా తనకు వచ్చిన పారితోషకాన్ని పేదలకు, ఆపదలో ఉన్నవారికి పంచి పెడుతూ ఇపుడు శభాష్ అనిపించుకుంటుంది ఈ జంట.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.