Amalapuram: ప్రజలు సంయమనం పాటించాలి.. అమలాపురం అల్లర్లపై డీఐజీ కీలక ప్రకటన

|

May 30, 2022 | 8:00 AM

అమలాపురంలో(Amalapuram) త్వరలోనే ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరిస్తామని డీఐజీ పాలరాజు(DIG Palaraju) తెలిపారు. కోనసీమలో జరుగుతున్న అల్లర్లపై పుకార్లు నమ్మవద్దని కోరారు. ప్రజలు సంయమనం పాటించాలని....

Amalapuram: ప్రజలు సంయమనం పాటించాలి.. అమలాపురం అల్లర్లపై డీఐజీ కీలక ప్రకటన
Dig Palaraju
Follow us on

అమలాపురంలో(Amalapuram) త్వరలోనే ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరిస్తామని డీఐజీ పాలరాజు(DIG Palaraju) తెలిపారు. కోనసీమలో జరుగుతున్న అల్లర్లపై పుకార్లు నమ్మవద్దని కోరారు. ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కోనసీమలో పోలీసు బందోబస్తు కొనసాగుతోందన్న డీఐజీ.. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటి దగ్ధం, కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎర్రవంతెన వద్ద జరిగిన ఘటన నిందితులను గుర్తిస్తున్నట్లు తెలిపారు. కోనసీమ(Konaseema) లో సెక్షన్ 30, 144 సెక్షన్ అమలులో ఉన్నందున్న ర్యాలీలు, సభలు, రహస్య సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. మరోవైపు.. అమలాపురంలో జరిగిన ఘటన నేపథ్యంలో కోనసీమలో ఐదు రోజులైనా ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించలేదు. మరోసారి అటువంటి ఘటనలకు చోటివ్వకుండా కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. ఇంటర్నెట్ నిలిపివేతతో ముమ్మిడివరం, అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలో సేవలు ఆగిపోయాయి. దీంతో పలు కార్యకలాపాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ముఖ్యంగా ఇంటి వద్ద పనులు చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వాట్సాప్‌, మెయిల్స్‌ చెక్‌ చేసుకునేందుకు సిగ్నల్ కోసం యువకులు గోదావరి తీరానికి వెళ్తున్నారు. డేటా సిగ్నల్‌ అందిన చోట అందరూ గుమిగూడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేపట్టిన నిరసనలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. అమలాపురం అంతటా హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి పినిపె విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను ఆందోళనకారులు తగలబెట్టారు. అంతేకాకుండా కొంతమంది రోడ్లపైకి వచ్చి రాళ్ల దాడికి దిగటంతో.. పోలీసులు పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు లాఠీచార్జ్ చేయడంతో పాటు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. ఇక ఈ అల్లర్లలో జిల్లా ఎస్పీ, డీఎస్పీతో పాటు ఏకంగా 30 మంది పోలీసులకు గాయాలయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి