Andhra Pradesh : మరో అద్భుతానికి ప్రాణం పోసిన ధర్మవరం నేతన్న.. ఔరా అనిపిస్తున్న శ్రీ రామకోటితో తయారు చేసిన పట్టు వస్త్రం

తమ పనితనంతో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న నేతన్నలు..చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసి ఔరా అనిపిస్తున్నారు.

Andhra Pradesh : మరో అద్భుతానికి ప్రాణం పోసిన ధర్మవరం నేతన్న.. ఔరా అనిపిస్తున్న శ్రీ రామకోటితో తయారు చేసిన పట్టు వస్త్రం
Saree
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 14, 2022 | 2:42 PM

తమ పనితనంతో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న నేతన్నలు..చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసి ఔరా అనిపిస్తున్నారు. అగ్గిపెట్టె, దబ్బనంలో పట్టే చీరతో పాటు..సుగంధాలు వెదజల్లే చీరలు నేసి మగువల మనసు దోచుకున్నారు. తాజాగా మరో అద్భుతానికి ప్రాణం పోశారు ధర్మవరం నేతన్న. దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అయోధ్య రామాలయానికి అందించేందుకు ఒక పట్టు వస్త్రాన్ని తయారుచేశారు. అది మామూలు పట్టువస్త్రం కాదు. ఎన్నో ప్రత్యేకతలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ పట్టువస్త్రంలో ప్రతి అణువుకి ఓ ప్రత్యేకత ఉంది. 180 అడుగుల పొడవు, 44ఇంచుల వెడల్పుతో 16కిలోల బరువుతో ఈ పట్టు వస్త్రం తయారుచేశారు. ఇందులో సప్తవర్ణాలు మిళితమై ఉంటాయి. అంతేకాదు. వస్త్రం అంచుల్లో రామాయణానికి సంబంధించిన 168 రకాల చిత్రాలుండేలా డిజైన్‌ చేశారు. పట్టువస్త్రం మధ్యన 32,200 జైశ్రీరామ్‌ అక్షరమాలను పొందుపరిచారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, తమిళం ఇలా మొత్తం 13భాషల్లో జై శ్రీరామ్‌ అన్న అక్షరాలను కూర్చారు.

ధర్మవరం పట్టణానికి చెందిన డిజైనర్‌ నాగరాజు ఆధ్వర్యంలో నలుగురు చేనేతలు 4 నెలల పాటు శ్రమించి ఈ వస్త్రాన్ని తయారుచేశారు. చేనేత మగ్గంపై రూపొందించిన శ్రీరామకోటి పట్టు వస్త్రాన్ని అయోధ్యలోని శ్రీరామ మందిరానికి బహూకరించనున్నట్లు తెలిపారు నాగరాజు. చేనేత మగ్గంపై తయారుచేసిన ఈ శ్రీరామకోటి పట్టువస్త్రాన్ని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆవిష్కరించారు. ఇక్కడి నేతన్న ఇలాంటి అద్భుతాలతో ధర్మవరానికి మరింత ప్రాముఖ్యత తీసుకొచ్చారన్నారు. తమ నైపుణ్యంతో అపురూపమైన పట్టు వస్త్రానికి ప్రాణం పోశారు ధర్మవరం నేతన్నలు. పట్టువస్త్రంపై రామకోటి లిఖించి అందరి మన్ననలూ పొందుతున్నారు. అలాగే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ చేనేత వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

Priyamani: మల్టీకలర్ శారీలో మత్తెక్కించే ఫోజులు ప్రియమణి లేటెస్ట్ పిక్స్

Yogi Adityanath: యూపీ విజయంతో బీజేపీలో మరింత బలమైన నేతగా సీఎం యోగి.. 2024 ఎన్నికల్లో తురుపుముక్క ఆయనేనట..!

Operation: ఆపరేషన్ తర్వాత చాలామంది బరువు పెరుగుతారు.. కారణం ఏంటో తెలుసా..!