అమలాపురంలో ఆషాడ మాసం సందర్భంగా శ్రీదేవి సెంటర్లో కొలువై ఉన్న శ్రీదేవి అమ్మవారికి ఆషాడం సారే సమర్పించారు స్థానికులు. అమలాపురం సహా పరిసర ప్రాంతాల గ్రామాలలోని ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక గడియార స్తంభం వినాయక గుడి వద్ద నుండి ప్రారంభమైన ఆషాడ సారే కార్యక్రమం ఎంతో వైభవంగా సాగింది. పెద్ద ఎత్తున గుమికూడిన భక్తులతో అమలాపురం గ్రామ దేవత అయిన శ్రీ సుబ్బాలమ్మవారిని దర్శించుకున్నారు భక్తజనం. ముమ్మిడివరం గేటు మీదగా శ్రీదేవి మార్కెట్లో కొలువైయున్న శ్రీదేవి అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో చలివిడి పానకాలు, మిఠాయిలు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని సారె అందచేశారు.
అమలాపురం ఆడపడుచులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమనికి తరలివచ్చిన భక్తులకు శ్రీదేవి మార్కెట్ కమిటీ భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ పట్టణ సీనియర్ నాయకుడు ఆసెట్టి ఆదిబాబు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు అమలాపురం పట్టణ వాసులకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు, పోటెత్తిన భక్త జనానికి ధన్యవాదాలు తెలియజేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..