Heat Wave: అత్యవసరమైతేనే బయటకు రండి.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక..

|

Apr 30, 2022 | 3:26 PM

Heat Wave: ఎండలు దంచికొడుతున్నాయి, ఉదయం పది దాటితే ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత బాగా పెరిగింది...

Heat Wave: అత్యవసరమైతేనే బయటకు రండి.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక..
Heat Wave
Follow us on

Heat Wave: ఎండలు దంచికొడుతున్నాయి, ఉదయం పది దాటితే ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని భారత వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. భానుడి మండిపోతున్నాడని, అప్రమత్తగా ఉండాలని రెండ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఇక ప్రస్తుతం నమోదవుతోన్న ఉష్ణోగ్రతలు సాధారణమేనని, రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు సూచించారు. ఉష్ణోగ్రతలతో పాటు వడ గాల్పులు కూడా ఊహించని స్థాయిలో ఉంటాయని హెచ్చరించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదువుతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండ దెబ్బ తగలకుండా పలు రకాల జాగ్రత్తుల తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోనూ ఎండలు దంచి కొడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటేస్తున్నాయి. ఢిల్లీ, యూపీ, రాజస్థాన్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశాకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. పలుచోట్ల టెంపరేచర్స్‌ 46 డిగ్రీలు దాటిపోయాయి. ఉత్తరప్రదేశ్‌ బాందాలో 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

ఇక రానున్న నాలుగు రోజుల్లో ఆదిలాబాద్‌, కుమురంభీమ్‌, నిర్మల్‌, జగిత్యాల్‌, మంచిర్యాల్‌, పెద్దపల్లి, జయశంకర్‌ జిల్లాల్లో 47 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు చుట్టూ ఉన్న సంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో 42 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని. మిగతా జిలాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వాతావరణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: IPL 2022: 9 మ్యాచ్‌ల్లో 132 పరుగులు.. ఒక్కసారిగా విలన్‌గా మారిన 8 కోట్ల ప్లేయర్‌ ఎవరో తెలుసా?

Viral Video: ఇదేం కర్మరా బాబూ.! బుడ్డోడి ఫ్రస్టేషన్ మాములుగా లేదుగా.. చూస్తే నోరెళ్లబెడతారు!

Viral Video: ఇదేం కర్మరా బాబూ.! బుడ్డోడి ఫ్రస్టేషన్ మాములుగా లేదుగా.. చూస్తే నోరెళ్లబెడతారు!