Visakhapatnam: దళిత యువకుడిపై దాడి.. చెట్టుకు కట్టేసి మరీ.. వీడియో వైరల్‌, చూస్తే షాకే!

|

Jun 09, 2022 | 4:33 PM

విశాఖ లో ఓ వీడియో వైరల్ గా మారింది. పెందుర్తి మండలం వి. జుత్తాడ గ్రామంలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Visakhapatnam: దళిత యువకుడిపై దాడి.. చెట్టుకు కట్టేసి మరీ.. వీడియో వైరల్‌, చూస్తే షాకే!
Chappal Beating
Follow us on

విశాఖ లో ఓ వీడియో వైరల్ గా మారింది. పెందుర్తి మండలం వి. జుత్తాడ గ్రామంలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. ఒక దళిత యువకుడిని మరో దళిత వ్యక్తి చెట్టుకు కట్టేసి చెప్పుతో కొట్టిన ఘటన కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. వారం రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

విశాఖపట్నం జిల్లాలోని వి. జుత్తాడకు చెందిన తారకేశ్వరరావు, సూరిబాబు అనే ఇద్దరు దళిత యువకులు అధికార పార్టీ కి చెందిన స్థానిక ఎంపిటిసికి ముఖ్య అనుచరులుగా తెలిసింది. వారం క్రితం తారకేశ్వరరావు మద్యం తాగి ఆ ఎంపిటిసి ని అసభ్య పదజాలంతో దూషించి, అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించినట్టు సమాచారం. ఆ ఘటన జరిగిన మర్నాడు తన మొబైల్ ఫోన్ ను దొంగిలించాడన్న ఆరోపణతో తారకేశ్వరరావును సూరిబాబు చెట్టుకు కట్టి చెప్పుతో కొట్టి, అసభ్య పదజాలంతో దూషించాడు. అదంతా వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. దాంతో వీడియో కాస్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

చెట్టుకు కట్టేసి చెప్పుతో కొట్టే సమయంలో సెల్ ఫోన్ కంటే ఆ అధికార పార్టీ నాయకుడిని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ.. సూరిబాబు విరుచుకుపడ్డ తీరు ఇప్పుడు వివాదాస్పదమైంది. తాజాగా, మంగళవారం రాత్రి మళ్లీ ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. సూరిబాబును చంపేస్తానని తారకేశ్వరరావు బెదిరించినట్లు, సూరిబాబు కూడా తిరిగి చంపేస్తానని బెదిరించిన నేపథ్యంలో వారం క్రితం జరిగిన ఈ వీడియోలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం తారకేశ్వర్ మాత్రం ఆ ఎంపిటిసి కి ఈ వివాదానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతుంటే పోలీసులు కూడా సెల్ ఫోన్ వివాదమే అని లైట్ తీసుకుంటున్నారు. దీనిపై పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.