Andhra Rains: ఏపీలో అల్పపీడన ప్రకోపం.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్…

|

Oct 14, 2024 | 4:48 PM

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం భయపెడుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Andhra Rains: ఏపీలో అల్పపీడన ప్రకోపం.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్...
Andhra Weather Report
Follow us on

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాగల 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదులే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదు. సోమవారం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధ, గురు వారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీవర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు దూరంగా ఉండాలి. ఒరిగిన విద్యుత్ స్థంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ కింద ఉండరాదు. పాత భవనాలు వదిలి సురక్షిత భవనాల్లోకి వెళ్ళాలి. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు.

అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

దక్షిణ కోస్తాలో 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం . నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్,  చిత్తూర్, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్న ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..