
కాకినాడ, అక్టోబర్ 28: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాన్‌గా మారింది. గడిచిన 6 గంటలో 15 కి.మీ వేగంతో కదిలిన తుపాన్.. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 60 కిమీ, కాకినాడకి 140 కిమీ, విశాఖపట్నంకి 240 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు కాకినాడ పోర్టుకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ అధికారులు జారీ చేశారు. దీంతో 10వ నంబర్ హెచ్చరిక ప్రకటించారు. కాకినాడ పోర్టుకు సమీపంగా లేదా పోర్టు మీద నుంచి బలమైన గాలులతో తుపాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో పోర్టు యాక్టివిటీస్ మొత్తం నిలుపుదల చేయాలని ఇండికేషన్. షిప్ లు సముద్రానికి 150 నాటికల్ మైళ్ళ దూరం తీసుకుని వెళ్లిపోవడం, కార్గో ఆపరేషన్ మొత్తం క్లోజ్ చేసేయాలని అధికారులు తెలిపారు.
తీవ్ర తుపాను తీరం వైపు క్రమంగా కదులుతోందని, కాకినాడ సమీపంలోనే ఈ రాత్రికి తీరం దాటబోతోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాధకుమార్ టీవీ9కి తెలిపారు. మొంథా తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గలలు విజయ అవకాశం ఉంది. కాకినాడకు 80-90 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రభావం ఉండనుంది. దీంతో ఈ ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, టవర్స్ పడిపోయే అవకాశం ఉంది. చెట్లు నేలకొరుగుతాయి. పూరిళ్లు ధ్వంసం అవుతాయని హెచ్చరించారు. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదల సూచన ఉందన్నారు. మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని, మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్లద్దని సూచించారు. కాకినాడతోపాటు మిగతా ప్రాంతాల్లో కూడా తుపాను గాలుల ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు ఈరోజు, రేపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఇక కాకినాడ తీర ప్రాంతంలో ఒక మీటర్ ఎత్తు వరకు అలలు ఎగసి పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో గాలుల తీవ్రత క్రమంగా పెరుగుతుంది. 3 రోజులు వేటకు వెళ్లొద్దు. ఓడ రేవుల్లో కాకినాడ 10, విశాఖ, గంగవరం 9, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణ, వాడరేవు 8 నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన అధికారులు. కొస్తాలో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం కూడా ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.