Telugu News Andhra Pradesh News Cyclone Michaung Landfall Between Bapatla, These 11 Districts In Andhra Pradesh issued Red Alert by Weather Department
Cyclone Michaung: బాపట్ల దగ్గర తీరం దాటిన మిచౌంగ్ తుఫాన్.. పెను విధ్వంసంతో..
Cyclone Michaung Updates: మిచౌంగ్ తుఫాన్ తీరం దాటింది. బాపట్ల దగ్గర మిచౌంగ్ తుఫాన్ తీరం దాటింది. తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతంలో భారీ ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. తీరాన్ని తాకిన సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలుల తీవ్రతకు చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది.
Cyclone Michaung Updates: మిచౌంగ్ తుఫాన్ తీరం దాటింది. బాపట్ల దగ్గర మిచౌంగ్ తుఫాన్ తీరం దాటింది. తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతంలో భారీ ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. తీరాన్ని తాకిన సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలుల తీవ్రతకు చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది.
మిచౌంగ్ తుపాను బాపట్ల సమీపంలో తీరాన్ని దాటిన తర్వాత బలహీనపడి వాయుగుండంగా మారనుంది. బాపట్ల తీర ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండగా.. సముద్రంలో అలలు.. ఐదు నుండి ఆరు అడుగుల మేర ఎగసిపడుతున్నాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం ఓడరేవు దగ్గర మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో సముద్రపు అలలు 10 అడుగుల మేర ఎగిసిపడుతున్నాయి. బాపట్ల దగ్గర తుపాను తీరాన్ని తాకడంతో అల్లవరం సమీపంలో సముద్రం అలకల్లోలంగా మారింది.
ఏపీలో మిచౌంగ్ తుపాను బీభత్సం సృష్టిస్టోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం కోడాపల్లి దగ్గర ఈదురుగాలులకు చెట్లు కూలి రోడ్డుపై పడ్డాయి. దాంతో.. రోడ్డుపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే స్పందించి చెట్లు తొలగించి రోడ్డు క్లియర్ చేశారు అధికారులు.
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో కోనసీమ జిల్లా కాట్రేనికొన మండలంలో కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. ఈదురు గాలులకు తోడు వర్షం భారీగా కురుస్తుండటంతో చెట్లు నేలకొరగగా.. మరికొన్ని ఇళ్లపైనా పడిపోయాయి. రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది చెట్లను తొలిగించారు.
భారీ వర్షాలతో తిరుమల క్షేత్రం జల కళ సంతరించుకుంది. గోగర్భం, పాపనాశం, కుమారధార, పసుపుధార, ఆకాశగంగ జలాశయాలు పూర్తిగా నిండటంతో నీటిని దిగువకు వదిలారు. దాంతో.. తిరుపతిలోని కపిలతీర్థం జలపాతం పరవళ్లు తొక్కుతోంది.
మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్‌తో చిత్తూరు జిల్లా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గంగాధర నెల్లూరు మండలం పరివాహక ప్రాంతమైన నీవానదిలో వరద ప్రవాహంతో రోడ్డు కొట్టుకుపోయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడి.. 15 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.
తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లా వెలుగొండలో భారీ వర్షం కురిసింది. రాపూరు దగ్గర కొండేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉప్పొంగడంతో నెల్లూరు- కడప జిల్లాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాపూరు, చిట్వేల్ ఘాట్ రోడ్డులో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో మిచౌంగ్ తూఫాన్ ప్రభావంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లి, చిట్వేలు మండలాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచింది.