Jawad Cyclone Live Updates: జోవాద్ తుపాను మరింత బలపడుతోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీరానికి 120 కిలోమీటర్ల చేరువలో తుపాను కేంద్రీకృతమైంది. ఇక విశాఖపట్నం తీరానికి దక్షిణంగా 120 కిలోమీటర్లు, గోపాల్‌పుర్‌కు ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో జోవాద్ తుపాను కేంద్రీకృతమైంది. ఇక ఉత్తర దిశగా కుదులతున్న తుపాను రేపు (ఆదివారం) మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తుపాను గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. తుపాను ప్రభావంతో
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుపాన్ తీరానికి దగ్గరగా వచ్చే సమయంలో 100 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇక తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద జోవాద్ తుపాను గురించి మాట్లాడుతూ.. ‘పశ్చిమ వాయవ్యదిశగా ప్రయాణిస్తున్న తుపాను ఉత్తరకోస్తా జిల్లాలకు దగ్గరగా రావొచ్చు. తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశాలున్నాయి. ఫలితంగా శనివారం కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండుచోట్ల అత్యంత భారీవర్షాలు పడతాయి’అని తెలిపారు
జొవాద్ తుఫాను తీవ్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శనివారం సాయంత్రం వెల్లడించింది. ఆదివారం పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మరికొన్ని దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించింది.
Bulletin No. 07 & 08 “Cancellation & Diversion of Trains due to Cyclone “JAWAD” #JawadCyclone #TrainUpdates @VijayawadaSCR pic.twitter.com/8mYW6IrDwZ
— South Central Railway (@SCRailwayIndia) December 4, 2021
– ఆర్కే బీచ్ లో పెరిగిన కెరటాల ఉధృతి
– కెరటాలలో కొట్టుకుపోయిన హైదరాబాద్ యువకుడు అబ్దుల్ నయీమ్
– అప్రమత్తమై కాపాడిన లైఫ్ గార్డ్స్
– కెరటాలలో కొట్టుకుపోతున్న నవీన్ ఒడ్డుకు చేర్చి ఆసుపత్రికి తరలింపు
– ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స… హైదరాబాద్ చింతల మెట్ట కు చెందిన వాడు గా గుర్తింపు
– తుఫాను నేపథ్యంలో అల్లకల్లోలంగా ఆర్కే బీచ్ తీరం
– ఇప్పటికే సూచనలు జారీ చేసిన అధికారులు, పోలీసులు
పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా కదులుతున్న తుఫాన్
ఆరు గంటల్లో మూడు కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా పయనం
ప్రస్తుతమిది విశాఖకు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు 310,
పారాదీప్ కు 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది
ఇవాళ రాత్రికి ఇది బలహీనపడి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం
రేపు మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీకి సమీపంలో వాయుగుండంగా మరింత బలహీన పడే సూచనలు
దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒడిశాలోనూ చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి
తీరం వెంబడి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి
క్రమంగా గాలుల వేగం కూడా తగ్గుముఖం పట్టే అవకాశం
క్రమంగా పశ్చిమ బెంగాల్ తీరం వద్ద మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని స్పష్టం చేసిన ఐఎండీ
తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్రతీరం అల్లకల్లోలం మారింది. ఉప్పాడ-కాకినాడ వైపు వెళ్లే బీచ్ రోడ్డులో.. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అలల ధాటికి రక్షణగా వేసిన జియోట్యూబ్ తెగిపడింది. రోడ్డుపై పడిన రాళ్లతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు అధికారులు.
విశాఖకు రెడ్ అలెర్ట్ జారీ అయింది. మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 89 పునరావాస కేంద్రాల్ని ఏర్పాటుచేశారు. జిల్లా, డివిజన్ స్థాయిలో 24/7 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటయ్యాయి. మరోవైపు.. జొవాద్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది విశాఖ నేవీ. సహాయక చర్యల కోసం 13 ఫ్లడ్ రిలీఫ్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఒడిశాకు 3 ఫ్లడ్ రిలీఫ్‌టీమ్స్, డైవింగ్ టీమ్స్ పంపిస్తున్నారు. సహాయక చర్యల కోసం NDRF,SDRF బృందాలు రెడీ అయ్యాయి. మొత్తం 1,735 సహాయక బృందాల్ని ఏర్పాటు చేశారు. హెలికాప్టర్లు సహా నాలుగు ఓడలు సిద్ధం చేసింది నేవీ. అతి భారీ వర్షాల నేపథ్యంలో.. ట్రాఫిక్ క్లియరెన్స్‌కు 9 బృందాలు ఏర్పాటు చేశారు. ఈనెల 5 వరకు విశాఖలో పర్యాటక ప్రదేశాలు మూసివేయనున్నారు.
ఏపీలో తుఫాన్‌ను ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒడిశా వైపు తుఫాన్ వెళ్లినా రేపు సాయంత్రం వరకు అధికారులు పూర్తి స్థాయిలో అలెర్ట్‌గా ఉంటారన్నారు. ఏపీలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ప్రస్తుతం విశాఖకు 210 కిలోమీటర్ల దూరంలో.. గోపాల్‌పూర్‌కు 320.. పారాదీప్‌కు 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. తుఫాన్ దిశ మార్చుకుని ఒడిశా వైపు పయనిస్తున్నట్టు వాతావరణశాఖ తెలిపింది.
జోవాద్ తుఫాన్ ఒడిశా తీరం వైపునకు కదులుతోంది. దీని ప్రభావంతో ఒడిశా సహా.. ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
తీరాన్ని తాకుతూ తిరిగి సముద్రంలోకి ప్రవేశించిన వాయుగుండం.. బెంగాల్ వైపు వేగంగా కదులుతుంది..
శ్రీకాకుళం , విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వర్షాల ధాటికి జనజీవనంఅస్తవ్యస్తంగా మారింది. ఇళ్లలోనుంచి జనాలు బయటకు కూడా రాలేని పరిస్థితి కనిపిస్తుంది.
తుపాన్ నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్ పరిధిలో 122 రైళ్లు రద్దయ్యాయి.. హౌరా, చెన్నై, భువనేశ్వర్, బెంగుళూర్ ప్రాంతాల మీదుగా వెళ్ళే పలు రైళ్ళను రద్దు చేసిన అధికారులు
తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది..
తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. సముద్రపు అలలు 3.5 మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
వాయవ్య దిశలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్. క్రమంగా దిశ మార్చుకుని రానున్న 12గంటల్లో ఒడిశా పూరీ తీరానికి చేరుకుంటుంది
ప్రస్తుతం ఒడిశాలోని పారదీప్‌కు 490 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం..
జొవాద్ తుపాను గోపాల్‌పుర్‌కు 340 కిలోమీటర్లు, పూరీకి 410 కిలోమీటర్ల దూరంలో ఉంది.
తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. తీరం వెంబడి గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాంధ్రతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు.
జోవాద్ తుపాను ముప్పు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు భారీ ముప్పు ఉండనుందని అధికారులు చెబుతున్నారు. ఈ జిల్లాల్లో మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న జవాద్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం తుపాను విశాఖకు ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో, పారదీప్‌కు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడచిన కొద్దీ గంటలుగా తుపాను వాయువ్య దిశలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. క్రమంగా దిశ మార్చుకుని రేపు మధ్యాహ్ననికి పూరీ తీరానికి చేరువగా వెళ్లే అవకాశం ఉందని ఐంఎండీ వెల్లడించింది.
భారీ వర్షాల కారణంగా.. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) విద్యుత్ వినియోగదారులకు అప్రమత్తం చేసింది. జోవద్ తుఫాన్ వల్ల ఏర్పడే విద్యుత్ ప్రమాదాలు, అవాంతరాలకు సంబంధించి సమాచారాన్ని ఏపిఈపీడీసీఎల్ కంట్రోల్ రూమ్ నంబర్లకు తెలియజేయాలని పేర్కొంది. తుపాను ప్రభావానికి తెగిపడిన విద్యుత్ వైర్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లపై పడిపోయిన చెట్లకొమ్మల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపింది. వాటి సమాచారాన్ని టోల్ ఫ్రీ నెం. 1912, కంట్రోలు రూమ్ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని ఏఎండీ కె.సంతోషరావు ప్రజలకు తెలిపారు.
తుపాన్ ప్రభావం భారీగా ఉండనున్న శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తర కోస్తాంధ్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నయని తెలిపారు.
తుపాన్ తీరం దాటే సమయంలో గాలుల వేగం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. నేడు, రేపు చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు.
తుపాన్ కారణంగా ఉత్తర కాస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చాలా చోట్ల ఏకంగా 20 సె.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
తుపాన్ ప్రభావాన్ని ఎదుర్కునేందుకు ముఖ్యమంత్రి సీఎం నడుం బిగించారు. ఇందులో భాగంగానే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూ.గో, ప.గో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం దిశా నిర్దేశం చేశారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకూడదని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాన్ ప్రభావిత జిల్లాలకు రూ. 10 కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచుకోవాలని సీఎం సూచించారు. సహాయ శిబిరాల్లో ఆహార నాణ్యత చాలా ముఖ్యమని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు.
తుపాన్ కారణంగా నేడు విద్యా సంస్ధలకు సెలవు ప్రకటించారు. గోదావరి నదిపై పాపికొండల విహార యాత్రను మూడు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు పర్యాటక శాఖ డీఎం వీరనారాయణ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 1,735 సహాయక బృందాలను ఏర్పాటుచేసింది. అలాగే, వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో హెల్ప్‌లైన్లు ఏర్పాటుచేశారు.
తుపాన్ ఎదర్కునేందుకు విశాఖ నేవీ కూడా సిద్ధమైంది. సహాయక చర్యల కోసం 13 ఫ్లడ్ రిలీఫ్ టీమ్స్‌ను రంగంలోకి దింపింది. అంతేకాకుండా 64 ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బందాలు కూడా సిద్ధమయ్యాయి. అవసరమైన వారు విశాఖ డీఆర్‌ఎం ఆఫీస్ కంట్రోల్ రూమ్ 0891-2590100 నెంబర్‌కు సంప్రదించండి.
జోవాద్ తుపాన్ కారణంగా అధికారులు ఇప్పటికే 95 రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తుపాన్ మరింత బలంగా మారడంతో తాజాగా మరో 24 రైళ్లని రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు.
తుపాన్ కారణంగా ఇబ్బందులు పడుతోన్న వారు ఈ హెల్ప్‌లైన్ నెంబర్లకు సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో : 0891–2744619, 2746330, 2746344, 2746338
విజయనగరం : 08922–221202, 221206, 8500358610
శ్రీకాకుళం : 0892–286213, 286245, 8500359367
నౌపడ జంక్షన్ : 08942–83520, 85959, 8500172878
రాయగడ స్టేషన్ పరిధిలో : 06856–223400, 223500