Cyclone Asani Highlights: ఏపీలో ఇంకా తగ్గని అసని ప్రభావం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు..

Shaik Madar Saheb

| Edited By: Subhash Goud

Updated on: May 12, 2022 | 7:28 PM

Cyclone Asani Highlights: అసని తుపాన్‌ రెండు రోజులుగా ఏపీ తీర ప్రాంతాల్లో కల్లోలం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచాయి. ..

Cyclone Asani Highlights: ఏపీలో ఇంకా తగ్గని అసని ప్రభావం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు..
Asani Cyclone

Cyclone Asani Highlights: అసని తుపాన్‌ రెండు రోజులుగా ఏపీ తీర ప్రాంతాల్లో కల్లోలం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచాయి. భారీ వృక్షాలు నేలకూలగా.. వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో అసని తుఫాన్‌ మచిలీపట్నం – నర్సాపురం వద్ద తీరం దాటింది. బుధవారం ఉదయానికి తుపానుగా బలహీనపడిన అసని.. రాత్రికి తీవ్ర వాయుగుండంగా మారి మచిలీపట్నానికి 20 కిలోమీటర్లు, నరసాపురానికి 40 కిలోమీటర్ల మధ్య తీరాన్ని దాటింది. ఇది రాత్రికి ఉత్తర ఈశాన్య దిశగా యానాం, కాకినాడ, తుని తీరాల వెంబడి కదులుతూ వాయుగుండంగా మారి మళ్లీ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. అయితే.. ఈ రాత్రికి నర్సాపూర్‌ దగ్గర మళ్లీ సముద్రంలోకి ప్రవేశించనుందని ఐఎండీ అంచనా వేసినప్పటికీ.. ‘అసని’ తుపాను క్రమంగా విశాఖ తీరం వైపు రావొచ్చని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉంది. విశాఖ తీర ప్రాంతంలో సిబ్బందిని అలర్ట్ చేశారు.

అయితే.. అసని తుఫాను ప్రభావం గురువారం విశాఖపట్నం జిల్లాపై తీవ్రంగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. విశాఖ, మన్యం ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. గరిష్ఠంగా 90 కి.మీ. వరకూ ఉండొచ్చని ప్రకటించింది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 May 2022 05:40 PM (IST)

    ఒడ్డుకు చేరిన బోటు

    తుఫాను కారణంగా సముద్రంలోకి 8 మంది మత్స్యకారులతో ఓ బోటు వెళ్లింది. అయితే సముద్రంలో వేటకు వెళ్లారన్న సమాచారం అందుకున్న అధికారులు.. పోలీసు, మత్స్య శాఖ సమన్వయంతో ఫోన్‌ సిగ్నల్స్‌ ద్వారా బోటు ఆచూకీ కనుగొన్నారు. ఎనిమిది మంది సహా బోటును తీరానికి తీసుకువచ్చారు.

  • 12 May 2022 05:14 PM (IST)

    సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు

    అసని తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మచిలీపట్నం సముద్రంలో చిక్కుకున్న మత్య కారులను క్షేమంగా ఒడ్డుకు చేర్చిన అధికారులు.

  • 12 May 2022 04:25 PM (IST)

    అరటి తోట నేలమట్టం

    ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి, మామిడి, అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అసని తుఫాను ప్రభావంతో వీచిన బలమైన ఈదురుగాలుల ధాటికి వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో మామిడి నేలరాలడంతో రైతుల కళ్లలో నీరు సుడులు తిరుగుతోంది. గెలలు వేసిన అరటి తోటలు నేలమట్టం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

  • 12 May 2022 04:06 PM (IST)

    అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు

    అసని తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు కోస్తాలో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు, కొద్ది ప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది.

  • 12 May 2022 03:56 PM (IST)

    దిక్కుతోచని స్థితిలో రైతులు

    ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి, మామిడి, అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అసని తుఫాను ప్రభావంతో వీచిన బలమైన ఈదురుగాలుల ధాటికి వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో మామిడి నేలరాలడంతో రైతుల కళ్లలో నీరు సుడులు తిరుగుతోంది. గెలలు వేసిన అరటి తోటలు నేలమట్టం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

  • 12 May 2022 03:20 PM (IST)

    తుఫానుతో భారీగా నష్టపోయి మామిడి తోటలు

    శ్రీకాకుళం జిల్లాలో మామిడి, జీడి మామిడి తోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈఏడాది పొగమంచు పుణ్యమా అని మామిడి కాపు పెద్దగా లేదు. నిలిచిన కాయలు కాస్తా తుఫాన్‌తో నేల రాలిపోయాయి. పంట చేతికొచ్చే వేళ అసని సృష్టించిన బీభత్సం రైతులను కొలుకోలేని దెబ్బతీసింది. మొక్కజొన్న, వేరుశనగ, అరటి, బొప్పాయి పంటలు కూడా నేలపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

  • 12 May 2022 03:05 PM (IST)

    కంటతడి పెట్టిస్తున్న ధాన్యం కుప్పలు

    కోనసీమ జిల్లాలో పంట నష్టం ఎక్కువగా ఉంది. చేతికొచ్చిన వరి పంటతో పాటు వబ్బిడి చేసిన ధాన్యం రాసులు తడిసి ముద్దవడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. ఎకరాకు వేలకు వేలు పెట్టుబడులు పెట్టారు. కోనసీమ జిల్లాలో అంబాజీపేట, పి.గన్నవరం అయినవిల్లి, రాజోలు, అమలాపురం, మాచవరం ప్రాంతాల్లో వరి చేలు నేలకొరిగి, ధాన్యం కుప్పలు తడిసి ముద్దయిన దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

  • 12 May 2022 02:55 PM (IST)

    తడిసి ముద్దాయిన ధాన్యం

    అసని తుఫాన్‌ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల రైతులకు గుండెకోత మిగిల్చింది. పంట చేతికొచ్చిన తరుణంలో వీచిన ఈదురుగాలులకు వరి చేలు నేలనంటాయి. కోతలు పూర్తయినచోట వర్షాలకు ధ్యానం తడిసి ముద్దయింది. కష్టమంతా వానపాలు కావడంతో రైతులు బోరుమంటున్నారు. ఇప్పటికే 80 వేల ఎకరాల్లో కోతలు పూర్తవ్వగా, ధాన్యాన్ని చేలల్లోనే ఉంచేశారు రైతులు. ఆ ధాన్యమంతా తడిసిపోయింది.

  • 12 May 2022 02:28 PM (IST)

    ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు

    అసని తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ప్రకాశం జిల్లావ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి. రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు పలు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా తీర ప్రాంతంలోని మండలాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంది.

  • 12 May 2022 02:07 PM (IST)

    పంట నష్టంపై వివరాలు సేకరిస్తున్న అధికారులు

    అసని తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. వేలాది ఎకరాల్లో పంట నష్టపోయింది. నష్టపోయిన పంటలను అధికారులు పరిశీలిస్తున్నారు. వ్యవసాయ అధికారులు పంట నష్టంపై వివరాలు సేకరిస్తున్నారు.

  • 12 May 2022 01:34 PM (IST)

    ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు..

    అసని తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ప్రకాశం జిల్లావ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి. రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు పలు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా తీర ప్రాంతంలోని మండలాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంది.

    పొన్నలూరు మండలం ముత్తరాసుపాలెం దగ్గర రోడ్డు కి గండిపడటంతో వాహన రాకపోకలు కు తీవ్ర అంతరాయం కలిగింది. తాత్కాలిక మారమ్మత్తులు చేపట్టాలని మారమ్మత్తులు చేపట్టగా JCB సైతం బురదలో కూరకుపోయింది.

  • 12 May 2022 12:41 PM (IST)

    వాయుగుండం నుంచి అల్పపీడనంగా.. అసని

    ‘అసని’ తుపాను మచిలీపట్నం తీరానికి దగ్గరగా తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండంగా బలహీనపడినట్లు.. వాతావరణ శాఖ తెలిపింది. గత ఆరు గంటల్లో స్థిరంగా ఉండి అక్కడే బలహీనపడినట్లు వెల్లడించింది. కొన్ని గంటలు ఇదే ప్రాంతం చుట్టూ తిరుగుతూ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది

  • 12 May 2022 12:19 PM (IST)

    కొనసాగుతున్న ఆరెంజ్ అలర్ట్..

    అశనిపాతం :వాయుగుండం కదులుతున్న ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులకు అవకాశం. కోస్తాంధ్ర తీరప్రాంతంలో ఆరంజ్ అలెర్ట్‌ను కొనసాగిస్తున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది.

  • 12 May 2022 11:47 AM (IST)

    మచిలీపట్నం తీరంలో బోటు మిస్సింగ్.. 8 మంది మత్స్యకారుల గల్లంతు..!

    కృష్ణా: మచిలీపట్నం తీరంలో బోటు మిస్సింగ్.. బోటులో 8 మంది మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం.. బోటు ఆచూకీ కోసం అధికారుల గాలింపు.. గల్లంతైన వారిలో కాకినాడ, ఉప్పాడకు చెందినవారు ఉన్నట్లు గుర్తింపు

  • 12 May 2022 11:34 AM (IST)

    కోస్తాంధ్రలో భారీ వర్షాలు

    అసని తుపాను అల్లకల్లోలం సృష్టిస్తోంది.అసని కారణంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెనువేగంతో గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన గాలుల ధాటికి తీవ్రమైన పంట నష్టం వాటిల్లుతోంది. వరి పంట నేలకొరగ్గా.. మామిడి కాయలు నేలరాలాయి. మరికొద్ది రోజుల్లో పంట చేతికి వచ్చే దశలో తుఫాన్ రావడంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

  • 12 May 2022 11:19 AM (IST)

    మన్యం జిల్లాలో భారీ వర్షాలు..

    అసని తుఫాన్‌ బీభత్సం కొనసాగుతోంది.. పార్వతీపురం మన్యం జిల్లా అసని తుఫాన్ కష్టాలు కొనసాగుతున్నాయి. పాచిపెంట మండలం మోసూరు దగ్గర వట్టిగెడ్డ కాజ్వే కొట్టుకుపోయింది..దీంతో పదిహేను గిరిశిఖర గ్రామాలకి రాకపోకలు బంద్‌ అయ్యాయి..కాజ్‌ వే కొట్టుకుపోవడంతో వట్టిగెడ్డ నీటిలోంచే రాకపోకలు సాగిస్తున్నారు గిరిజనలు..

  • 12 May 2022 11:08 AM (IST)

    పంట నష్టంపై వివరాల సేకరణ

    అసని తుఫాన్‌ కోనసీమ రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. పంట చేతికి వచ్చే టైమ్‌లో తుఫాన్‌ రావడంతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. పంట నష్టంపై వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు.

  • 12 May 2022 11:01 AM (IST)

    ఉప్పు రైతులను కూడా దెబ్బతీసిన అసని తుఫాన్..

    ఇటు అసని తుఫాన్‌ ఉప్పు రైతులను కూడా దెబ్బతీసింది. ఏడాదిలో అరు నెలలు మాత్రమే ఉప్పు పండిస్తారు. మేలో అధికంగా ఉప్పు పండుతోంది. అయితే తుఫాన్‌ దెబ్బకు ఉప్పు సైతం నీళ్లలో కిరగిపోయింది. మరోసారి పంట రావాలంటే పది నుంచి 20 రోజులు పండుతుంది. అయితే రుతుపవనాలు ఎంట్రీ ఇస్తే ఆ పంట కూడా పండే పరిస్థితి లేదు. ఉప్పు రైతులపై తుఫాన్‌ ఎపెక్ట్‌ను మా ప్రతినిధి రవి అందిస్తారు.

  • 12 May 2022 10:43 AM (IST)

    భారీగా పంట నష్టం..

    అసని తుఫాను ప్రభావంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈదురుగాలుల ధాటికి వేల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. అసని తుఫాన్‌ రైతుల ఆశలను ఆవిరి చేసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మామిడి, అరటి, ధాన్యం రైతులు తీవ్రంగా నష్ట పోయారు. నేలరాలిన మామిడితో రైతు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.

    కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో వందల ఎకరాల్లోని అరటి, మొక్కజొన్న తోటలు ధ్వంసం అయ్యాయి. తుఫాను ధాటికి ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో బొప్పాయి, మామిడి, అరటి పంటలు నాశనం అయ్యాయి. దక్షిణ కోస్తాలో వర్షం కంటే ఈదురు గాలుల కారణంగా అధిక నష్టం వాటిల్లింది. తుఫాను ప్రభావంతో పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది

  • 12 May 2022 09:33 AM (IST)

    ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12 కోట్ల మేర నష్టం

    అసని తుఫాన్ ప్రభావం తో ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 12 కోట్ల మేర నష్టం సంభవించింది. ఉద్యాన పంటలు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. నంద్యాల జిల్లాలోనే పంట నష్టం ఎక్కువగా ఉంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి.

  • 12 May 2022 09:30 AM (IST)

    విమాన సర్వీసుల పునరుద్ధరణ..

    అసని తుఫాను ప్రభావం తగ్గడంతో.. విమాన సర్వీసులను పునరుద్ధరించారు.

  • 12 May 2022 09:02 AM (IST)

    ఉధృతంగా ప్రవహిస్తున్న ఎర్రవాగు.. ఆందోళనలో ఇంటర్ విద్యార్థులు..

    నెల్లూరు కందుకూరు – గుండ్లవాగు మధ్య ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పరీక్షకు వెళ్తున్న ఇంటర్ విద్యార్థులు అక్కడే నిలిచిపోయారు.

  • 12 May 2022 08:59 AM (IST)

    తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

    అసని తుఫాన్ ఈరోజు మరింత బలహీన పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

  • 12 May 2022 08:46 AM (IST)

    అల్పపీడనంగా మారనున్న అసని తుఫాన్..

    అల్పపీడనంగా మారనున్న అసని తుఫాన్..

    మచిలిపట్నం దగ్గర నిశ్చలంగా కొనసాగుతున్న అసని తుఫాన్.. నేడు మరింత బలహీన పడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.

  • 12 May 2022 08:28 AM (IST)

    కోస్తాంధ్రలో భారీ వర్షాలు..

    కోస్తాంధ్రలో భారీ వర్షాలు..

    అసని తుఫాన్ బలహీనపడి.. తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

  • 12 May 2022 08:18 AM (IST)

    విశాఖలో అలర్ట్..

    విశాఖలో అలర్ట్..

    వాతావరణ శాఖ విశాఖపట్నం జిల్లాకు రెడ్‌ ఎలర్ట్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు.

  • 12 May 2022 08:17 AM (IST)

    రేపటి వరకు ప్రభావం..

    తుపాన్‌ బలహీనపడినా 24 గంటలపాటు దీని ప్రభావం ఉంటుందని వెల్లడించింది వాతావరణ శాఖ. కోస్తాంధ్రలో గంటకు 70 నుంచి 90 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Published On - May 12,2022 8:12 AM

Follow us