AP Weather Alert: బలహీన పడిన వాయుగుండం.. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

|

Mar 23, 2022 | 1:57 PM

AP Weather Update: అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతం(Bay Of Bengal) పరిసర ప్రాంతాల్లో నిన్న (మంగళవారం) ఉన్న తీవ్ర వాయుగుండం బలహీన పడింది. ఈరోజు ఆ..

AP Weather Alert: బలహీన పడిన వాయుగుండం.. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
Ap Weather Alert
Follow us on

AP Weather Alert: అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతం(Bay Of Bengal) పరిసర ప్రాంతాల్లో నిన్న (మంగళవారం) ఉన్న తీవ్ర వాయుగుండం బలహీన పడింది. ఈరోజు ఆ వాయుగుండం అల్పపీడనం (Low Pressure)గా మారింది. మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మరింతగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో.. ఆంధ్రప్రదేశ్, యానంలోని దిగువ ట్రోపో ఆవరణములో తూర్పు గాలులు వీస్తున్నాయని పేర్కొంది. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనను తెలిపింది.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: ఈ ప్రాంతాల్లో ఈరోజు, రేపు , ఎల్లుండి.. తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈరోజు ఒకటి రెండు  చోట్ల ఉరుములు లేదా మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు రేపు , ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈరోజు ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించవచ్చునని తెలిపింది.

రాయలసీమ: ఈరోజు రేపు , ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈరోజు ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించవచ్చునని పేర్కొంది.

Also Read:

Kacha Badam Song: కొనసాగుతున్న కచ్చా బాదాం సాంగ్ ఫీవర్.. ఈ సారి పోలీసుల వంతు.. వీడియో వైరల్

Kadiri Temple: కొనసాగుతున్న కాటమరాయుడి బ్రహ్మోత్సవాలు.. నేడు రథోత్సవ వేడుక.. భారీగా తరలివచ్చిన భక్తులు