Cyclone Asani: ముందుకు చొచ్చుకొస్తున్న సముద్రం.. ఏపీలో మొదలైన అసని ప్రభావం..

అసని తుఫాన్ ప్రభావంతో తీరప్రాంతం కోతకు గురవుతోంది. తీరంలో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఏపీలో పలుచోట్ల సముద్రం ముందుకొచ్చింది. అన్ని పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

Cyclone Asani: ముందుకు చొచ్చుకొస్తున్న సముద్రం.. ఏపీలో మొదలైన అసని ప్రభావం..
Asani Cyclone Live Tracking

Updated on: May 10, 2022 | 1:05 PM

సముద్రం ప్రమాదకరంగా ముందుకు చొచ్చుకొస్తుంది.. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.. అసని తుపాను(Cyclone Asani) ప్రభావంతో తీర ప్రాంతాల్లో అలజడి మొదలైంది. భారీ వర్షాలు ముంచెత్తుతాయన్న అంచనాలతో తీర ప్రాంత ప్రజల్ని అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. అసని తుఫాన్ ప్రభావంతో తీరప్రాంతం కోతకు గురవుతోంది. తీరంలో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఏపీలో పలుచోట్ల సముద్రం ముందుకొచ్చింది. అన్ని పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కి.మీ., గరిష్టంగా 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్‌ వైర్లు తెగిపడి సరఫరా నిలిచిపోయింది.

అసని తుపాను పశ్చిమ బెంగాల్‌, ఒడిశా తీర ప్రాంతంలో తీవ్ర ప్రభావం చూపనుంది. బెంగాల్, ఒడిశా సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుల వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. బిహార్‌, జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌లో కూడా తుపాను ప్రభావం కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

భారీ వర్షాలు, బలమైన గాలులతో చెన్నై విమానాశ్రయం నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, జైపూర్, ముంబై సహా 22 విమానాలు రద్దు చేసినట్టు ప్రకటించింది చెన్నై ఎయిర్‌పోర్ట్ అథారిటీ. ప్యాసింజర్లకు నిన్ననే సమాచారమిచ్చింది.