అర్నబ్ తుఫాన్ బీభత్సం.. వేలాది చెట్లు నేలమట్టం, సహాయక చర్యలపై చంద్రబాబు కీలక ఆదేశాలు
అర్నబ్ తుఫాన్ ఉగ్రరూపం దాలచింది. గత 16 గంటలుగా వందకు 10 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు ఇపుడు భారీవర్షం తోడైంది. విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకు ఒరిగి ప్రధాన రహదారులు కకావికలమైన పరిస్థితి. అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రహదారులపై కూలిన చెట్ల తొలగింపు, నష్టం అంచనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు.

అమరావతి: అర్నబ్ తుఫాన్ ఉగ్రరూపం దాలచింది. గత 16 గంటలుగా వందకు 10 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు ఇపుడు భారీవర్షం తోడైంది. విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకు ఒరిగి ప్రధాన రహదారులు కకావికలమైన పరిస్థితి. అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రహదారులపై కూలిన చెట్ల తొలగింపు, నష్టం అంచనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. అమరావతిలోని సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి కలెక్టర్లతో మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను త్వరితగతిన పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
ఆరు జిల్లాల్లో భారీ వర్షపాతం
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడ సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని సీఎం సూచించారు. మిగిలిన ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని అధికారులు తెలిపారు.
విద్యుత్, రహదారుల పునరుద్ధరణకు ప్రాధాన్యం
తుఫాన్ కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారి-16పై కూలిన చెట్ల తొలగింపు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఇతర ప్రాంతాల్లోనూ మధ్యాహ్నం 3 గంటలలోపు చెట్ల తొలగింపు పూర్తి చేస్తామని తెలిపారు. సాయంత్రానికి అన్ని జిల్లాల్లో రహదారులను పూర్తిస్థాయిలో క్లియర్ చేయాలని సీఎం ఆదేశించారు.
కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైతే ఏపీసీపీడీసీఎల్ నుంచి అదనపు సిబ్బందిని పంపించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, రవాణా సేవలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
కోనసీమలో నేలకూలిన వేలాది చెట్లు
తుఫాన్ తీవ్రతకు కోనసీమ ప్రాంతంలో భారీగా కొబ్బరి చెట్లు నేలకూలినట్లు అధికారులు వివరించారు. సుమారు 33 వేల కొబ్బరి చెట్లు దెబ్బతిన్నట్లు సమీక్షలో ప్రస్తావించారు. కోనసీమ జిల్లాలో సుమారు 10 వేల చెట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 వేల చెట్లు కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నష్టంతో రైతులు, ఉద్యానవన సాగుదారులకు ఎదురైన నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయాలని సీఎం సూచించారు.
తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనాలు
వ్యవసాయం, ఉద్యానవన శాఖలతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలు నష్టం అంచనాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పంటలు, పశుసంపద, ఇళ్లు, విద్యుత్ వ్యవస్థ, రహదారులు, చెరువులకు జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించాలని సూచించారు. ప్రభావిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేలా శాఖల మధ్య సమన్వయం ఉండాలని తెలిపారు. తుఫాన్ అనంతరం పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా, తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజారోగ్యంపై కూడా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
రిజర్వాయర్లు, వరద నీటిపై నిరంతర పర్యవేక్షణ
రాష్ట్రంలోని రిజర్వాయర్లలోకి వస్తున్న నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని చంద్రబాబు ఆదేశించారు. సీసీటీవీ కెమెరాలు, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. వరద నీటి నిర్వహణలో ముందస్తు అంచనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైన నిర్ణయాలను ఆలస్యం చేయకుండా తీసుకోవాలని అధికారులకు తెలిపారు.
గత తుఫాన్ల అనుభవాలతో విపత్తుల నిర్వహణ
గత పదేళ్లలో రాష్ట్రాన్ని 26 తుఫాన్లు ప్రభావితం చేశాయని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. దివిసీమ ఉప్పెన, హుద్‌హుద్, తిత్లీ వంటి విపత్తుల సమయంలో బలమైన గాలుల కారణంగా భారీ నష్టం జరిగిందని గుర్తుచేశారు. బుడమేరు వరదల సమయంలో విజయవాడలోనే ఉండి పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
అర్నబ్ తుఫాన్ సమయంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినట్లు సీఎం వెల్లడించారు. ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రతి అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటున్నామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమర్థంగా వినియోగించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అధికారుల మధ్య సమన్వయానికి సీఎం సూచనలు
క్షేత్రస్థాయి నుంచి అందే సమాచారాన్ని విశ్లేషించి అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడంతో పాటు రహదారులు, విద్యుత్, తాగునీటి సేవలను త్వరగా పునరుద్ధరించాలని ఆదేశించారు.
గత రాత్రి నుంచి సమీక్ష సమయం వరకు నాలుగు సార్లు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ పరిస్థితులు, సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్షించినట్లు సమాచారం. ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు పూర్తిగా పునరుద్ధరించే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
మొత్తంగా, అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు తక్షణ ఉపశమనం కల్పించడం, మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడం, నష్టాన్ని అంచనా వేయడం, భవిష్యత్తులో విపత్తులను మరింత సమర్థంగా ఎదుర్కొనే వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
వీడియో ఇక్కడ చూడండి..
#WATCH | Amaravati | Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu arrives at the Secretariat, reviews cyclone cyclone-affected districts through CCTV cameras at the Real-Time Governance Society (RTGS).
Real-Time Governance Society (RTGS) officials briefed the Chief Minister on Cyclone Arnab’s movement and the prevailing ground situation in affected areas. The Chief Minister enquired whether fallen trees in various locations had caused traffic disruptions. He directed officials to immediately remove uprooted trees on national highways and other roads to restore normal traffic movement.
IT Secretary Katamneni Bhaskar informed the Chief Minister that the situation had been continuously monitored through RTGS since the cyclone warnings were issued. Officials also explained that complaints received through the Mana Mitra app were being forwarded to the concerned authorities and that steps were being taken to resolve the issues promptly.
Source: CMO
— ANI (@ANI) October 28, 2026
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
