Cyber crime: యాప్ డౌన్ లోడ్ చేస్తే డబ్బులొస్తాయన్నారు.. ఇన్ స్టాల్ చేశాక నగదు మాయం చేశారు

|

Mar 25, 2022 | 10:06 AM

సైబర్ నేరాలు (Cyber Crime) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అమాయకులనే కాదు విద్యావంతులనూ ఏమార్చుతున్నారు. లాటరీ వచ్చిందనో, ఆఫర్ ఉందనో ఇలా ఏవో కారణాలు చెప్పి నమ్మిస్తున్నారు. తీరా నమ్మాక నట్టేట ముంచుతున్నారు....

Cyber crime: యాప్ డౌన్ లోడ్ చేస్తే డబ్బులొస్తాయన్నారు.. ఇన్ స్టాల్ చేశాక నగదు మాయం చేశారు
Cyber
Follow us on

సైబర్ నేరాలు (Cyber Crime) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అమాయకులనే కాదు విద్యావంతులనూ ఏమార్చుతున్నారు. లాటరీ వచ్చిందనో, ఆఫర్ ఉందనో ఇలా ఏవో కారణాలు చెప్పి నమ్మిస్తున్నారు. తీరా నమ్మాక నట్టేట ముంచుతున్నారు. అందంగా మాట్లాడి, మభ్యపెట్టి ఓటీపీ(OTP) నంబర్లు తెలుసుకుంటున్నారు. అందిన కాడికి దోచుకుని పత్తా లేకుండా పోతున్నారు. మరోవైపు సైబర్ నేరాలు కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. జనాలకు అవసరమైన దానిని ఎరగా వాడుకుంటున్నారు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఖాతా నుంచి డెబ్భై ఐదు వేల రూపాయలు మాయమయ్యాయి. నకిలీ యాప్(Fake App) డౌన్ లోడ్ చేయించి మరీ ఈ నేరానికి పాల్పడ్డారు. విజయవాడలోని సీతారాంపురం ప్రాంతానికి చెందిన అశోక్‌కుమార్‌ ఓ ప్రైవేటు ఎలక్ట్రికల్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా తిరుపతిలో జరిగిన మీటింగ్ కు వెళ్లాడు. అక్కడ ఓ యాప్‌ ద్వారా డీటీహెచ్‌కు రీఛార్జి చేశాడు. డబ్బులు కట్‌ అయినా రీఛార్జి కాకపోవటంతో యాప్‌ కస్టమర్‌ కేర్‌ నెంబరు కోసం ఆన్‌లైన్‌లో వెతికాడు. ఆన్‌లైన్‌లో ఓ నంబర్ కనిపిస్తే దానికి ఫోన్ చేశాడు.

మొబిక్విక్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే డబ్బులు తిరిగి వస్తాయని చెప్పటంతో దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. ఆ క్షణమే అతని రెండు బ్యాంకు ఖాతాల నుంచి రూ.71,000లు, రూ.4,200లు విత్ డ్రా చేసుకున్నట్లు సందేశాలు వచ్చాయి. దీంతో అవాక్కైన అశోక్.. విజయవాడకు వచ్చి బ్యాంకు అధికారులను సంప్రదించాడు. డబ్బులు పోయాయని గుర్తించి సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Also Read

Samantha strong counter: మీ పని మీరు చూసుకోండి అంటూ.. వాళ్లకు సమంత స్ట్రాంగ్‌ కౌంటర్‌..! సామ్‌ లేటెస్ట్‌ పోస్ట్‌

Vijay devarakonda: విజయ్‌, సమంత సినిమాపై క్రేజీ అప్‌డేట్‌.. అలనాటి సూపర్‌ హిట్‌ చిత్రం ఇతివృత్తంతో.?

Leopard vs Phone: ఫోన్ కాపాడిన ప్రాణం.. దెబ్బకు పరుగులు తీసిన చిరుతపులి.. పూర్తివివరాలివే..!