Andhra Pradesh: తాము ఖాతాలు తెరిచిన బ్యాంకుకే తాళం వేసిన కస్టమర్స్.. అసలు విషయం ఏంటంటే..?

లక్కవరం యూనియన్‌ బ్యాంకుకు ఖాతాదారులే తాళం వేశారు. అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం పదండి.

Andhra Pradesh: తాము ఖాతాలు తెరిచిన బ్యాంకుకే తాళం వేసిన కస్టమర్స్.. అసలు విషయం ఏంటంటే..?
Bank Locked

Updated on: Jun 15, 2022 | 12:04 PM

Eluru District: ఏలూరు జిల్లాలో ఓ విచిత్ర ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. బ్యాంకుకు ఖాతాదారులే తాళం వేశారు. అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం పదండి. లక్కవరం(Lakkavaram) యూనియన్ బ్యాంక్‌(Union Bank)కు బుధవారం ఉదయాన్నే భారీ ఎత్తున చేరుకున్నారు ఖాతాదారులు. ఆపై బ్యాంకు మెయిన్ గేటుకు తాళం వేశారు. బ్యాంకు సిబ్బంది వారించే ప్రయత్నం చేసినా కస్టమర్స్ అస్సలు ఊరుకోలేదు. ఖాతాదారులకు చెందిన 68 లక్షల రూపాయల సొమ్ము పక్కదారి మళ్ళించారంటూ బ్యాంకు ఉద్యోగి రవిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో.. గత నెల నాలుగో తేదీన అతనిపై పోలీసులు కేసు పెట్టారు. ఇప్పటివరకు తమకు న్యాయం జరగలేదంటూ బ్యాంక్ కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్‌ బ్యాంకు ముందు ఆందోళన చేశారు. గేటుకు తాళాలు వేశారు. తమకు న్యాయం జరిగే వరకు తాళాలు తీయబోమని తేల్చి చెప్తున్నారు. పోలీసులు కానీ, పై అధికారులు కానీ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులు వారితో చర్చలు జరుపుతున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి