Andhra: చెరువులో ఒక్కసారిగా అలజడి.. దగ్గరకు వెళ్లి చూడగా గుండె గుభేల్

మాచర్ల పట్టణం చుట్టూ చంద్రవంక ప్రవహిస్తుంటుంది. చంద్రవంకలో సాధారణంగా వర్షాకాలంలో మాత్రమే నీళ్లు ఉంటాయి. అయితే కొన్ని కొన్ని చోట్ల నీరు నిలిచి ఉంటుంది. ఈ చంద్రవంక కృష్ణా నదిలో కలుస్తుంది. చంద్రవంక కలిసే ఎగువ ప్రాంతంలో ఎక్కువుగా మొసళ్లు సంచరిస్తుంటాయి.

Andhra: చెరువులో ఒక్కసారిగా అలజడి.. దగ్గరకు వెళ్లి చూడగా గుండె గుభేల్
Telugu News 1

Edited By: Ravi Kiran

Updated on: Nov 13, 2025 | 2:12 PM

మాచర్ల పట్టణం చుట్టూ చంద్రవంక ప్రవహిస్తుంటుంది. చంద్రవంకలో సాధారణంగా వర్షాకాలంలో మాత్రమే నీళ్లు ఉంటాయి. అయితే కొన్ని కొన్ని చోట్ల నీరు నిలిచి ఉంటుంది. ఈ చంద్రవంక కృష్ణా నదిలో కలుస్తుంది. చంద్రవంక కలిసే ఎగువ ప్రాంతంలో ఎక్కువుగా మొసళ్లు సంచరిస్తుంటాయి. ఎత్తిపోతల పథకం వద్ద కూడా మొసళ్ల మడుగు ఉంది. ఇక్కడే మొసళ్ల సంరక్షణా కేంద్రం కూడా ఉంది. భారీ వర్షాలు కురిసిన సమయంలో మొసళ్లు కృష్ణా నదిలోకి అటు నుంచి చంద్రవంకలో వస్తుంటాయి. ఈ క్రమంలోనే స్థానికులు అప్రమత్తంగా ఉంటూ వస్తారు. అయితే మాచర్ల రామా టాకీస్ లైన్ చివర్లో చంద్రవంకలో ఈ రోజు మొసలి కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

మాచర్ల పట్టణంలోని స్థానికులు చంద్రవంక వద్ద అటు ఇటు దాటుతూ ఉంటారు. మరికొంత మంది అక్కడే బట్టలు ఉతుకుతుంటారు. ఆ ప్రాంతంలోకి మొసలి రావడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఒడ్డకు వచ్చిన మొసలి చాలా సేపటి వరకూ అక్కడే తిష్ట వేయడంతో స్థానికులు వెంటనే అటవీ శాఖాధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ సిబ్బంది మొసలి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు.

స్థానికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సాధారణంగా మొసళ్లు దాడి చేయవని అయితే అది సంచరించే ప్రాంతంలో నీళ్లలోకి దిగవద్దని చెప్పారు. త్వరలోనే బోన్లు ఏర్పాటు చేసి మొసలి పట్టుకుంటామన్నారు. చంద్రవంక పరిసర ప్రాంతాల్లో పట్టుకున్న మొసళ్లను ఎత్తిపోతల వద్దనున్న సంరక్షణ కేంద్రంలోనో లేదంటూ కృష్ణా నదిలోనో వదిలిపెడుతుంటారు. స్థానికులు ఆందోళన చెందడంతో అటవీ శాఖ సిబ్బంది కూడా వారిలో ధైర్యం నింపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ట్రాప్ బోన్ ఏర్పాటు చేసి త్వరలోనే మొసలిని పట్టుకుంటామని భరోసా కల్పించారు