Andhrapradesh: ఏపీలో ప్లాస్టిక్ భూతం.. పశువులు, పక్షులు పాలిట యమపాశంలా మారిన వైనం

|

Jul 15, 2021 | 8:16 AM

ఏపీలోని పలు ప్రధాన నగరాల్లో ప్లాస్టిక్‌ సమస్య వెంటాడుతోంది. ఈ ప్లాస్టిక్  భూతంతో... మనుషులే కాదు... పశువులు, పక్షులు ప్రమాదం బారిన పడుతున్నాయి...

Andhrapradesh: ఏపీలో ప్లాస్టిక్ భూతం.. పశువులు, పక్షులు పాలిట యమపాశంలా మారిన వైనం
Plastic In Animals
Follow us on

ఏపీలోని పలు ప్రధాన నగరాల్లో ప్లాస్టిక్‌ సమస్య వెంటాడుతోంది. ఈ ప్లాస్టిక్  భూతంతో… మనుషులే కాదు… పశువులు, పక్షులు ప్రమాదం బారిన పడుతున్నాయి. ముఖ్యంగా… నగరాల్లో రోడ్లపై తిరిగే ఆవులపై ప్లాస్టిక్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటోంది. చెత్తకుప్పల దగ్గర ఆవులు తినే ఆహారంలో బారీగా ప్లాస్టిక్‌ ఉండి… పశువులకు రకరకాల రోగాలు వస్తున్నాయి. ఏ పాపం తెలియని ఆవులు వింత వ్యాధులతో మరణిస్తున్నాయి. ఏపీలోని పలు నగరపాలక సంస్థల్లో… ప్లాస్టిక్ వేస్టేజ్‌పై సరైన నిర్వహణ లేని కారణంగా.. రోజురోజుకూ ముప్పు పెరుగుతోంది. ఇంటింటి నుంచి చెత్త సేకరణ మంచి ఫలితాన్నే ఇచ్చినా… రోడ్లపై మాత్రం పరిస్థితి మారడం లేదు. ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తూనే ఉన్నారు. దీనిపై పురపాలక అధికారులు చర్యలు తీసుకోకపోతే… ఫ్యూచర్‌లో మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

ఏపీ వ్యాప్తంగా… ప్లాస్టిక్ వ్యర్థాలు తిని వందలాది గోవులు చనిపోతున్నాయి. ప్లాస్టిక్ తినడం వల్ల వింత వ్యాధులు సోకుతున్నాయి. వ్యాధులు సోకిన కొన్నింటిని పలు స్వచ్ఛంద సంస్థలు ముందే గుర్తించి ట్రీట్‌మెంట్ చేయిస్తున్నారు. చికిత్స టైంలో… పశువుల కడుపులో ఉండే ప్లాస్టిక్‌ చూసి డాక్టర్లు అవాక్కవుతున్నారు. ప్లాస్టిక్‌ ఆవుల కడుపులో ఉంటే వాటికే ప్రమాదం అనుకుంటే తప్పని… వాటి పాల ద్వారా కూడా ప్లాస్టిక్ ఎఫెక్ట్ మనుషులపైనా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Also Read: Andhrapradesh: ఆ జిల్లాల్లో పదునైన ఆయుధాలపై మరో 6 నెలలు నిషేధం పొడిగింపు

మరణం చుట్టూ ముసిరిన ప్రశ్నలు.. ఫాదర్ అడిగిన క్వశ్చన్స్.. సురేష్ చెప్పిన ఆన్సర్స్..