
పాడి రైతులు కొన్నిసార్లు పాడి ఆవుల మెడలో ట్యూబ్స్ అమర్చుతారు. దీని వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. కొన్నిసార్లు ఆవులు తమ పొదుగులోని పాలను అవే స్వయంగా తాగుతుంటాయి. ఈ అలవాటును సెల్ఫ్-సక్లింగ్ అని పిలుస్తారు, ఇది పాల దిగుబడిపై ప్రభావం చూపుతుంది. ఆవుల ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఈ అలవాటును ఆపడం కోసం రైతులు ఆవు మెడలో ప్రత్యేకమైన ట్యూబ్స్‌ను అమరుస్తారు. ఈ ట్యూబ్స్ ఆవు తన మెడను వెనక్కి వంచి పొదుగును అందుకోకుండా అడ్డుకుంటాయి. ఇది ఆవు తన అలవాటును మర్చిపోయేలా చేయడానికి ఒక తాత్కాలిక పద్ధతి. కొన్ని రోజుల పాటు ట్యూబ్స్‌ను ఉంచిన తర్వాత, ఆవు ఆ అలవాటును పూర్తిగా వదులుకున్నాక, వాటిని తొలగిస్తారు. ఈ పద్ధతి రైతులు తమ పాడి పశువులను సంరక్షించడానికి.. పాల ఉత్పత్తిని సమర్థవంతంగా నిర్వహించడానికి అనుసరించే ఒక సాధారణ పరిష్కారం.
ఆవులు తమ పాలను అవే ఎందుకు తాగుతాయి…?
దూడగా ఉన్నప్పుడు.. తల్లిపాలను ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. లేదా బాటిల్ / రబ్బర్ నిప్పుల్‌తో పెంచితే ఆ సక్కింగ్ రిఫ్లెక్స్ పెద్దయ్యాక కూడా మిగిలిపోతుంది. అలవాటు రూపంలో మారుతుంది. అలానే.. సరిపడా మేత లేకపోతే.. ప్రోటీన్, ఖనిజాలు తక్కువైతే శరీరం ఇంకా కావాలి అన్న కోరికతో.. తన పాలను తానే తాగుతుంది. పొదుగు ఎక్కువగా నిండిపోతే.. అసౌకర్యంతో ఉపశమనానికి తానే పాలు తాగుతుంది. మానసిక ఒత్తిడి వల్ల కొన్ని ఆవులు ఇలా ప్రవర్తిస్తాయి. ఆ అలవాటును మాన్పించేందుకు రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..