Cow Baby Shower Function:హిందువులకు గోమాతను దైవంగా భావించి పూజిస్తారు. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని పురాణాల కథనం. ఆవును పూజిస్తే అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంపదలు లభిస్తాయని.. సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని హిందువులు నమ్మకం. అందుకనే హిందువులు ఆవుని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అంతేకాదు తమ ఇంట్లో ఆవుని ఎంతో ఇష్టంగా, సొంత ఇంటి పిల్లల్లా భావించి పెంచుకుంటారు. ఆవులు.. వాటి సంతానాన్ని తమ ఇంటి సభ్యుల్లా ఎంతో అల్లారు ముద్దుగా చూడడమే కాదు.. వాటికి సీమంతం, పుట్టిన రోజు , నామకరణం వంటి ఫంక్షన్లు జరిపి పదిమందికి తమ సంతోషాన్ని పంచుతూ వేడుకలను జరుపుతారు. తాజాగా అనంతరపురం జిల్లాలో ఓ కుటుంబం వైభంగా గోమాతకు సీమంతం ఫంక్షన్ చేశారు.
ముదిగుబ్బలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఇంటి ఆడబిడ్డలకు నిర్వహించినట్లే గోవుకు సీమంతం వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోమాతకు ముత్తైదువుల సమక్షంలో సీమంతం కార్యక్రమాన్ని ఘనంగా చేశారు. గోవుకి పసుపు కుంకుమలతో పూజలు చేసి.. పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించారు. . తమ సంతోషాన్ని పదిమందికి పంచుతూ.. ఏకంగా ఆవు సీమంతం వేడుకల్లో భాగంగా ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
గోమాత ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే సీమంతం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని ముతైదువులు, మహిళలు గోవుకు చీరసార, పసుపు కుంకుమలు సమర్పించారు.
Also Read: