క‌రోనా నేప‌థ్యంలో గుంత‌క‌ల్ రైల్వే అధికారుల న‌యా టెక్నిక్.. టెంపరేచర్ ఎక్కువుంటే మోగుతున్న అలారం

|

Apr 30, 2021 | 2:49 PM

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని గుంతకల్ రైల్వే అధికారులు అత్యాధునిక థర్మల్ స్క్రీనింగ్.....

క‌రోనా నేప‌థ్యంలో గుంత‌క‌ల్ రైల్వే అధికారుల న‌యా టెక్నిక్.. టెంపరేచర్ ఎక్కువుంటే మోగుతున్న అలారం
Guntakal Railway Station
Follow us on

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని గుంతకల్ రైల్వే అధికారులు అత్యాధునిక థర్మల్ స్క్రీనింగ్ పద్ధతిని అవలంబిస్తున్నారు. ఇందుకుగాను గుంతకల్ రైల్వే డివిజన్ కేంద్రంలో రైల్వే స్టేషన్  ప్రవేశ ద్వారంలో  పరికరం అమర్చారు. ఈ పరికరం రైల్వే స్టేషన్ లోకి ప్రవేశించే ప్రతి ప్రయాణికుడిని కెమెరాలో రికార్డ్ చేస్తుంది. అదే సమయంలో కెమెరా పక్కనే ఉన్న థర్మల్ స్క్రీనింగ్ మెషిన్ ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రతను ప్రత్యేకంగా అమర్చిన కంప్యూటర్ స్క్రీన్ పై వీడియో రికార్డ్ చేస్తుంది. ప్రయాణికుడి టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్లయితే.. ఆ ప్రయాణికుడి ఫోటో పక్కనే హైలైట్ చేస్తూ హై టెంపరేచర్ అంటూ ఫోటో పై చూపిస్తూ ఒక అలారం మోగుతుంది.

దీంతో వెంటనే ఎంట్రీ వద్ద ఉన్న రైల్వే సిబ్బంది ఆ ప్రయాణికుడుని స్టేషన్ లోనికి ప్రవేశించకుండా అక్కడే నిలిపివేస్తారు. క్షుణ్ణంగా పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తారు. కోవిడ్‌ నెగెటివ్‌ నిర్ధారణ చేసుకున్న తర్వాతే, ప్రయాణికుల టికెట్ తోపాటు ఐడీ ప్రూఫ్ పరిశీలించి రైల్వే స్టేషన్ లోకి అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ఆధునిక థర్మల్ స్క్రీనింగ్ ద్వారా ఆరోగ్యం సరిగా లేని వారిని నియంత్రించడం ద్వారా రైలు ప్రయాణం మరింత సురక్షితంగా మార్చారు రైల్వే అధికారులు.

Also Read: పది రాష్ట్రాల్లోనే 90 శాతం కరోనా కేసులు.. మహారాష్ట్ర అధికం కట్టడికి దారేది?

వైరస్‌ సోకినవారికి బ్యాలెన్స్‌డ్‌ డైట్ త‌ప్ప‌నిస‌రి..ప్రొటీన్లతో ఉండే ఆహారం మ‌స్ట్.. రోగనిరోధకశక్తిని పెంచే పదార్థాలివే