మాస్క్‌ వేసుకోలేదని ఘర్షణ.. ఓ యువతి మృతి

|

Jul 12, 2020 | 1:12 PM

చిన్నపాటి వివాదం రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టింది. మాస్క్‌ వేసుకోలేదని జరిగిన ఘర్షణలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

మాస్క్‌ వేసుకోలేదని ఘర్షణ.. ఓ యువతి మృతి
Follow us on

చిన్నపాటి వివాదం రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టింది. మాస్క్‌ వేసుకోలేదని జరిగిన ఘర్షణలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

రెంటచింతలలోని పిచ్చికుంట వీధిలో కర్నాటి యలమంద తన కుటుంబంతో నివాసముంటున్నాడు. అయితే, తన వ్యక్తిగత పనులపై చెరువు సమీపంలోని వీధిలోకి మాస్క్‌ లేకుండా వెళ్లాడు. అక్కడున్న యువకులు మాస్క్‌ లేకుండా వచ్చినందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో మాస్క్ ఉంటేనే తమ వీధిలోకి రావాలని అడ్డుకున్నారు. అయితే, కొద్ది రోజుల తరువాత చెరువు సమీప వీధి యువకులు పిచ్చికుంట బజారుకు మాస్క్‌లేకుండా వచ్చారు. గతంలో జరిగిన ఘటనను మనసులో పెట్టుకున్న యలమంద బంధువులు యువకుల రాకపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. చెరువు వీధి యువకులు నలుగురు కర్రలతో యలమందపై దాడి చేశారు. దాడిలో అడ్డొచ్చిన యలమంద కుమార్తె కర్నాటి ఫాతిమా(19) తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఫాతిమాను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. యలమంద ఫిర్యాదు మేరకు నలుగురిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.