చేతిలో బ్లేడ్.. భార్యతో కలిసి రైలు పట్టాలపైకి వెళ్లిన భర్త.. అప్పుడే దూసుకొచ్చిన ట్రైన్.. చివరకు ఏం జరిగిందంటే..?
రైలు పట్టాలపై భార్యాభర్తలు.. భర్త చేతిలో బ్లేడ్.. తన భార్యను చంపి తాను చనిపోతానంటూ వార్నింగ్.. సిగ్నల్ ఇవ్వడంతో కొన్ని క్షణాల్లోనే పట్టాలపైకి రానున్న రైలు.. అంతా టెన్షన్ టెన్షన్.. ఆ సమయంలోనే ఓ పోలీస్ ఎంతో ధైర్య సాహసం చేశారు. ఆయన వ్యవహరించిన తీరు.. చూపిన ధైర్య సాహసాలు ఇద్దరి నిండు ప్రాణాలను కాపాడింది.

రైలు పట్టాలపై భార్యాభర్తలు.. భర్త చేతిలో బ్లేడ్.. తన భార్యను చంపి తాను చనిపోతానంటూ వార్నింగ్.. సిగ్నల్ ఇవ్వడంతో కొన్ని క్షణాల్లోనే పట్టాలపైకి రానున్న రైలు.. అంతా టెన్షన్ టెన్షన్.. ఆ సమయంలోనే ఓ పోలీస్ ఎంతో ధైర్య సాహసం చేశారు. ఆయన వ్యవహరించిన తీరు.. చూపిన ధైర్య సాహసాలు ఇద్దరి నిండు ప్రాణాలను కాపాడింది. ఆయన చూపిన సమయస్ఫూర్తి వారిని ప్రమాదం నుంచి కాపాడింది. ఆ సమయంలో ఉద్రేకంగా ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా.. రెండు ప్రాణాలు బలయ్యేయి.. ఆ పోలీస్ ధైర్యసాహసాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శభాష్ పోలీస్ అంటూ ఆ పోలీసును సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అసలు ఆ వ్యక్తి.. భార్యతో కలిసి రైలు పట్టాల మీదకు ఎందుకెళ్లాడు.. పోలీస్ ఇద్దరి ప్రాణాలు కాపాడటం వెనుక ఉన్న కథ ఏంటి..? ఏం చేసి ఆ పోలీస్ వారిని కాపాడాడు..? ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా వట్లూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలో ఓ యువకుడు తన భార్యను చంపి తాను కూడా చనిపోతానంటూ బ్లేడుతో శరీరంపై కోసుకుంటూ రైలు పట్టాల మీద వీరంగం సృష్టించాడు. రాజేష్, నిర్మల భార్యాభర్తలు.. వీరికి ముగ్గురు సంతానం.. గత కొంతకాలంగా రాజేష్, నిర్మల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఇద్దరు తరచూ గొడవ పడుతుండేవారు. అయితే ఆరోజు ఏమైందో ఏమో గాని రాజేష్ తన భార్యను తీసుకుని వట్లూరు సమీపంలో రైలు పట్టాల పైకి తీసుకువచ్చాడు. అంతటితో ఆగక తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో తన శరీరంపై గాయాలు చేసుకుంటూ తన భార్యను చంపి తాను చచ్చిపోతాను అంటూ వీరంగం సృష్టించాడు.
అయితే, రాజేష్ తీరును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజేష్ కు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ అతను ఏమాత్రం వినిపించుకోలేదు. తన దగ్గరకు వస్తే బ్లేడుతో కోసుకుంటానని, ఈరోజు ఇద్దరం కలిసి చనిపోతామంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. అయితే అందులో ఓ పోలీస్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. “రాజేష్‌తో ప్రేమగా మాట్లాడారు. నువ్వు మంచి వాడివి రా నాయనా అంటూ బ్రతిమిలాడాడు.. నీకు పిల్లలు ఉన్నారు. ఆలోచించు అంటూనే నేను నీకు తెలుసు కదరా తమ్ముడు.. ముందు నీ సమస్య నాతో చెప్పు అంటూ అతని దృష్టి మరల్చారు.” ఈలోపు మిగతా కానిస్టేబుళ్లు స్థానికులు అతన్ని పట్టుకొని ఆమెను విడిపించారు.
వీడియో చూడండి..
రాజేష్ వినపించుకోకుండా బ్లేడుతో తనను తాను గాయపరచుకుంటున్న సమయంలో అతని కట్టడి చేశారు. ఇదంతా జరుగుతున్న సమయంలోనే సిగ్నల్ ఇవ్వడంతో పక్కనే ఉన్న పట్టాలపై ట్రైన్ దూసుకువచ్చింది.. ఆ పోలీస్ ఏమాత్రం లేటు చేసినా.. రాజేష్ తన భార్యతో సహా తాను కూడా రైలు కిందపడి చనిపోయేవాడు. ఈ సమయంలో కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించి రెండు నిండు ప్రాణాలు కాపాడారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో అందరూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..